News April 11, 2024

BIG BREAKING: కవితకు మరో షాక్

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. అదే కేసులో ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇటీవల కవితను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే ఈడీ కేసులో ఆమె తిహార్ జైలులో ఉన్నారు.

Similar News

News January 13, 2026

సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో పండగ వేళ నాన్‌వెజ్ ధరలు షాక్ ఇస్తున్నాయి. ఏపీలోని విజయవాడ సహా ప్రధాన నగరాల్లో కేజీ చికెన్ రేట్ రూ.350 పలుకుతోంది. పట్టణాలు, గ్రామాల్లో అయితే దీనికి అదనంగా రూ.20 కలిపి రూ.370కి విక్రయిస్తున్నారు. అటు తెలంగాణలోని హైదరాబాద్‌లో కేజీ కోడి మాంసం రూ.300-320 పలుకుతోంది. మిగతా ప్రాంతాల్లోని ధరల్లో స్వల్ప తేడాలున్నాయి. మరి మీ ఏరియాలో కేజీ చికెన్ ధర ఎంత?

News January 13, 2026

వంటింటి చిట్కాలు

image

* వెండి వస్తువులు నల్లగా మారిపోతే వాటికి టమాటా కెచప్‌ రాసి, 15 నిమిషాల తర్వాత మెత్తటి వస్త్రంతో తుడిస్తే తెల్లగా మెరుస్తాయి.
* బొంబాయి హల్వా రుచిగా రావాలంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని కలపాలి.
* అరటికాయ చిప్స్ కరకరలాడాలంటే వేయించే ముందు వాటిపై ఉప్పు నీటిని చిలకరించాలి.
* ఫ్లవర్ వాజుల్లో నీటిని మార్చినపుడు అందులో కాస్త పంచదార వేస్తే వల్ల పూలు వాడిపోకుండా తాజాగా ఉంటాయి.

News January 13, 2026

BHELలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

image

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) హరిద్వార్‌లో 50 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీటెక్, BE, డిప్లొమా అర్హతగల వారు అర్హులు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 -27ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,900, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.10,900చెల్లిస్తారు. వెబ్‌సైట్: hwr.bhel.com