News November 18, 2024
BIG BREAKING: ఎందరు పిల్లలు ఉన్నా పోటీకి అర్హులే

AP: పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ ఏపీ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. జనాభా వృద్ధి రేటు పెంపులో భాగంగా ఏపీ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇకపై ఎందరు పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత లభిస్తుంది. మండలిలో ఈ బిల్లులు ఆమోదం పొందితే కొత్త చట్టం అమల్లోకి వస్తుంది.
Similar News
News October 17, 2025
రేపు ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం భేటీ

AP: సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రుల బృందం రేపు 12 PMకు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఉద్యోగులకు డీఏ సహా వివిధ ఆర్థిక అంశాలపై చర్చించనున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం మంత్రులను ఆదేశించారు.
News October 17, 2025
భారత్ మౌనంగా ఉండదు: మోదీ

కొవిడ్ తర్వాత ప్రపంచంలో వరుస యుద్ధాలు, ఉద్రిక్తతలు కొనసాగినా భారత్ అభివృద్ధిలో ముందుకెళ్లిందని ప్రధాని మోదీ NDTV సమ్మిట్లో అన్నారు. సగటున 7.8% వృద్ధిరేటు సాధిస్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై దేశం మౌనంగా ఉండదని.. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ రూపంలో వారికి గట్టిగా బదులిచ్చామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం బ్యాంకింగ్ సెక్టార్లో సంస్కరణలు తెచ్చిందని వివరించారు.
News October 17, 2025
తిన్న వెంటనే నడుస్తున్నారా?

భోజనం చేశాక నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే తిన్న వెంటనే కాకుండా 10-15 నిమిషాల తర్వాత వాకింగ్ చేస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. తిన్న వెంటనే నడిస్తే కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చని చెబుతున్నారు. భోజనం చేశాక 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే త్వరగా జీర్ణం అవుతుందని, బరువు తగ్గుతారని సూచిస్తున్నారు.
Share it