News February 8, 2025

అరవింద్ కేజ్రీవాల్ ఓటమి

image

ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీకి అతిపెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన కంచుకోట న్యూఢిల్లీ నుంచి ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయన్ను 3182 ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ఆయన్ను నాలుగోసారి ప్రజలు తిరస్కరించారు. లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, అవినీతి, క్లీన్ ఇమేజ్ పోవడం ఇందుకు కారణాలు.

Similar News

News March 24, 2026

మన దగ్గర ఎన్నిరోజులకు సరిపడా ఇంధనం ఉందంటే..

image

దేశంలో దిగుమతులకు అంతరాయం ఏర్పడితే మన క్రూడాయిల్ రిజర్వులు(100% కెపాసిటీ) 9.5 రోజులకే సరిపోతాయని కేంద్రం వెల్లడించింది. వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వు(SPR)ల్లో 33.72 లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్ నిల్వ ఉందని తెలిపింది. APలోని విశాఖ, KAలోని మంగళూరు, పాదూర్‌లో ఈ రిజర్వులు ఉన్నట్లు వివరించింది. వీటి మొత్తం కెపాసిటీ 53.3L MT అని పేర్కొంది. RTI ద్వారా India Today అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది.

News March 24, 2026

యుద్ధం.. బీర్లు తాగేవారికి షాక్!

image

దేశంలో బీర్ల ధరలు పెరుగుతాయని, సరఫరాకు కొరత ఏర్పడొచ్చని బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(BAI) తెలిపింది. ‘యుద్ధం వల్ల తయారీ ఖర్చు 12-15% పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఉత్పత్తి వ్యయం కంటే తక్కువగా ధరలు ఉన్నాయి’ అని పేర్కొంది. సీసాల ధరలు 20%, మెటీరియల్స్ రేట్లు 20-25%, రవాణా ఖర్చులు 10% పెరిగాయి. BAIలోని యునైటెడ్ బ్రూవరీస్, కార్ల్స్‌బర్గ్, AB InBev తదితర కంపెనీలు దేశంలో 85% బీర్లు అమ్ముతున్నాయి.

News March 24, 2026

సినీ పరిశ్రమ అభివృద్ధిపై CM CBNతో సంజయ్ దత్ భేటీ

image

AP: CM CBNతో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, షూటింగ్‌లకు APని కేంద్రంగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలు, ఉన్న అవకాశాలపై చర్చ జరిగింది. సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సంజయ్ దత్ వివరించారు. ఫిలిం స్టూడియోలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా ప్రణాళికలు ఉన్నాయని CM తెలిపారు.