News November 19, 2024
BIG BREAKING: కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ షాక్
TG: కాంట్రాక్ట్ ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. వారిని రెగ్యులరైజ్ చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.16ను హైకోర్టు కొట్టేసింది. వారి రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. దీంతో ఇకపై వారంతా తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగే అవకాశం ఉంది. విద్య, వైద్య శాఖల్లో వేలాది మంది ఉద్యోగులు రెగ్యులరైజ్ కాగా, హైకోర్టు తీర్పుతో వారిలో ఆందోళన నెలకొంది.
Similar News
News November 19, 2024
విశాఖ అత్యాచార ఘటనపై స్పందించిన హోంమంత్రి
AP: విశాఖలో లా స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ సీపీతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘అత్యాచారానికి పాల్పడిన యువకులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని ఆమె భరోసా ఇచ్చారు.
News November 19, 2024
డిసెంబర్లో IPOకు విశాల్ మెగా మార్ట్?
దుస్తులు, జనరల్ మర్చండైజ్, FMCGను విక్రయించే విశాల్ మెగామార్ట్ DEC రెండో వారం తర్వాత IPOకు వస్తుందని సమాచారం. ఇష్యూ విలువ రూ.8000 కోట్లని తెలిసింది. నిజానికి నవంబర్లోనే మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలనుకున్నా ప్రస్తుత కరెక్షన్ దృష్ట్యా వాయిదా వేసింది. 2023-24లో కంపెనీ రూ.8,911CR ఆదాయం, రూ.461CR లాభం ఆర్జించింది. విశాల్‌కు చెందిన 19 బ్రాండ్లు రూ.100CR, 6 బ్రాండ్లు రూ.500CR చొప్పున అమ్ముడవ్వడం గమనార్హం.
News November 19, 2024
Battle of Bombay: ముంబై షెహర్ కిస్కా హై!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని 36 సీట్లు పార్టీలకు కీలకంగా మారాయి. శివసేన UBT కంచుకోటను బద్దలుకొట్టాలని మహాయుతి ప్రయత్నిస్తోంది. MVA నుంచి శివసేన UBT 22 చోట్ల, కాంగ్రెస్ 11, NCPSP 3 చోట్ల బరిలో ఉన్నాయి. అటు BJP 18, శివసేన 15, NCP 3 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 6 స్థానాల్లో MVA 4 గెలుచుకొని సత్తాచాటింది. అదే హవా కొనసాగించాలని చూస్తోంది.