News August 14, 2024
BIG BREAKING: వినేశ్‌కు భారీ షాక్.. అప్పీల్ డిస్మిస్

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో షాక్ తగిలింది. వినేశ్ అప్పీల్‌ను కోర్టు డిస్మిస్ చేసినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(IOA) నిర్ధారించింది. దీంతో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయారు. రెజ్లింగ్ ఫైనల్‌కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండటంతో IOC ఆమెను డిస్క్వాలిఫై చేసింది.
Similar News
News January 17, 2026
BREAKING: మేయర్ల రిజర్వేషన్లు ఖరారు

TG: కార్పొరేషన్ మేయర్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించినట్లు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి వెల్లడించారు.
*నిజామాబాద్- మహిళ జనరల్ *నల్గొండ- మహిళ జనరల్
*ఖమ్మం- మహిళ జనరల్ *గ్రేటర్ వరంగల్- జనరల్
*GHMC- మహిళ జనరల్ *కరీంనగర్- బీసీ జనరల్
*మంచిర్యాల- బీసీ జనరల్ *మహబూబ్‌నగర్- బీసీ మహిళ
*రామగుండం- ఎస్సీ జనరల్ *కొత్తగూడెం- ఎస్టీ జనరల్
News January 17, 2026
3 రోజుల్లోనే రూ.61.1 కోట్లు

నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే రూ.61.1 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 14 విడుదలైన ఈ మూవీ తొలి రోజు రూ.22 కోట్లు, రెండు రోజుల్లో రూ.41.2కోట్లు సాధించింది. మారి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు.
News January 17, 2026
నగలు సర్దేయండిలా..

మహిళలకు అలంకారం, ఆభరణాలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. మార్కెట్లోకి లేటెస్ట్గా ఏ నగ వచ్చినా సరే కొనేయాల్సిందే. అయితే వాటిని సరిగ్గా భద్రపరచకపోతే అవి కొన్నాళ్లకు రంగుమారి పాడైపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే..ఆభరణాలు భద్రపరిచే ముందు శుభ్రంగా తుడిచి ఆరబెట్టిన తర్వాతే బాక్సుల్లో సర్దాలి. అన్ని రకాల నగలను ఒకే బాక్సులో పెట్టకూడదు. విడివిడిగా ఎయిర్‌టైట్ బాక్సులు, జిప్ లాక్ బ్యాగులు వాడాలి.


