News March 22, 2025

BIG BREAKING: మళ్లీ విజృంభించిన బర్డ్ ఫ్లూ..

image

TG: కొన్ని వారాలుగా తగ్గుముఖం పట్టిన బర్డ్ ఫ్లూ మళ్లీ కోరలుచాస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి, భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం ప్రాంతాల్లో ఈ మహమ్మారిని అధికారులు గుర్తించారు. నివారణ చర్యల్లో భాగంగా బయోసేఫ్టీ సిబ్బంది 2 లక్షల కోళ్లను తొలగించారు. అధికారులు పరిసరాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు. కోళ్ల ఫుడ్, వ్యర్థాలు సహా అన్నింటినీ క్లియర్ చేస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు.

Similar News

News December 10, 2025

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో ఉద్యోగాలు

image

<>నేషనల్ <<>>ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో 7 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా లేదా బీఎస్సీ లేదా ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nise.res.in/.

News December 10, 2025

నానో ఎరువులను ఎలా వాడాలి?

image

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్‌‌లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.

News December 10, 2025

ఇతిహాసాలు క్విజ్ – 92

image

ఈరోజు ప్రశ్న: గణపతి, కార్తీకేయ సోదరులను ముల్లోకాలు చుట్టిరమ్మనే పరీక్ష శివుడు ఎందుకు పెట్టాడు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>