News December 30, 2025

BIG BREAKING: BNGR: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!

image

TGలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా మొదలైంది. ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు BNGR, ఆలేరు, చౌటుప్పల్, మోత్కూర్, పోచంపల్లి, యాదగిరిగుట్ట పుర కమిషనర్లతో నిర్వహించిన VCలో ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని ఆదేశాలు అందాయి. ఈ రిజర్వేషన్ల గెజిట్ వెలువడగానే అధికారిక నోటిఫికేషన్ రానుంది.

SHARE IT

Similar News

News February 15, 2026

​జనజీవన స్రవంతిలోకి రండి.. మావోలకు TG పోలీస్ పిలుపు

image

TGలోని అండర్‌గ్రౌండ్ మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పోలీస్ శాఖ మరోసారి విజ్ఞప్తి చేసింది. లొంగిపోయే వారికి ప్రభుత్వ ‘సరెండర్&రిహాబిలిటేషన్’ పాలసీ కింద తక్షణ ఆర్థిక సాయం, ఇతర ప్రయోజనాలు అందుతాయని DGP శివధర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రెండేళ్లలో 588 మంది సాధారణ జీవితంలోకి వచ్చి గౌరవప్రదంగా గడుపుతున్నారని పేర్కొన్నారు. మిగిలిన 15 మంది వెంటనే లొంగిపోవాలని కోరారు.

News February 15, 2026

T20 WC: USA భారీ స్కోర్

image

చెన్నై: నమీబియాతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన USA 20 ఓవర్లలో 199-4 స్కోర్ చేసింది. సంజయ్ కృష్ణమూర్తి (68*), మోనాంక్ పటేల్ (52) రాణించారు. సంజయ్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఆయన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. NAM బౌలర్లలో విల్లెమ్, గెర్హార్డ్ ఎరాస్మస్ చెరో 2 వికెట్లు తీశారు.

News February 15, 2026

రైతులకు రూ.20వేలు ఎక్కడంటూ CBNకు YCP ప్రశ్న

image

AP: కూటమి ప్రభుత్వంలో అన్నదాతను నిండా ముంచేశారని వైసీపీ ఆరోపించింది. ‘అన్నదాత సుఖీభవ కింద 54 లక్షల మంది రైతులకు ఏటా రూ.20,000 ఇస్తామని చెప్పి ఈ బడ్జెట్లో రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఏ మూలకు సరిపోవు అన్న విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసు. అయినా చంద్రబాబు మోసాన్ని భరించక తప్పడం లేదు. అరకొర నిధుల కేటాయింపుతో ఈ ఏడాదీ రైతులకు తిప్పలే’ అని ట్వీట్ చేసింది.