News June 19, 2024

BIG BREAKING: UGC-NET రద్దు

image

నిన్న దేశవ్యాప్తంగా నిర్వహించిన UGC-NET పరీక్షను రద్దు చేస్తున్నట్లు NTA ప్రకటించింది. పేపర్ లీకైందని నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ నుంచి సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై CBI విచారణకు ఆదేశించింది. మరోసారి NET నిర్వహిస్తామని ప్రకటించింది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి దీనిని నిర్వహిస్తారు. మరోవైపు NEETలో అవకతవకలు జరిగాయని ఇప్పటికే ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Similar News

News January 18, 2025

భారతీయుల ఆయుర్దాయం ఎంతంటే?

image

ప్రపంచంలోని వివిధ దేశాలను బట్టి ప్రజల సగటు జీవిత కాలం మారుతుంటుంది. హాంకాంగ్‌లో ఉండే ప్రజలు సగటున ఏకంగా 85 ఏళ్లు జీవిస్తారని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ వెల్లడించింది. అత్యల్పంగా నైజీరియాలో 53 ఏళ్లు మాత్రమే జీవిస్తారని తెలిపింది. ఈ జాబితాలో మకావో(85), జపాన్(84), సౌత్ కొరియా(84), స్విట్జర్లాండ్(84), సింగపూర్(83), నార్వే(83), AUS(83), స్పెయిన్(83), ఇండియా(67), పాకిస్థాన్(66) ఉన్నాయి.

News January 18, 2025

ఆహారాన్ని పదే పదే వేడిచేస్తున్నారా?

image

అన్నంతో పాటు ఇతర ఆహార పదార్థాలను పదే పదే వేడి చేసి తినడం ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘గదిలో రైస్‌ను ఎక్కువ సేపు ఉంచడం వల్ల బ్యాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది హానికరమైన టాక్సిన్స్ విడుదల చేస్తుంది. దీంతో పోషకాలు కోల్పోవడం, జీర్ణ సమస్యలు & ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే రైస్ వండిన గంటలోనే ఫ్రిజ్‌లో ఉంచి తినేముందు వేడి చేయాలి’ అని సూచిస్తున్నారు.

News January 18, 2025

కొలికపూడిపై అధిష్ఠానం సీరియస్.. చర్యలకు సిద్ధం!

image

AP: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలకు టీడీపీ అధిష్ఠానం సిద్ధమైంది. ఇటీవల ఓ ఎస్టీ మహిళపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. సీఎం చంద్రబాబు కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం క్రమశిక్షణా కమిటీ ముందు హాజరవ్వాలని కొలికపూడిని ఆదేశించింది. గతంలోనూ ఆయన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.