News July 8, 2024
ఏపీ టెట్ షెడ్యూల్‌లో మార్పులు

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) షెడ్యూల్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. జులై 2న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ జరగాల్సి ఉండగా, ఆ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని తెలిపింది. ప్రిపరేషన్‌కు సమయం కోసం అభ్యర్థుల వినతి మేరకు సవరణ నోటిఫికేషన్‌ను ఇవాళ రిలీజ్ చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
Similar News
News December 10, 2025
తలరాతను మార్చే క్రమంలో చిగురించిన ప్రేమ..!

బిహార్‌లో సినిమా కథను తలపించే ఘటన జరిగింది. రైళ్లలో యాచిస్తున్న అనాథ బాలికను చూసి ఒక యువకుడు చలించిపోయాడు. ఆమె తలరాతను మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఎంతో శ్రమించి ఆమె కుటుంబ మూలాలను కనుగొని విడిపోయిన వారికి దగ్గర చేశాడు. మానవత్వంతో మొదలైన ఈ ప్రయాణంలో వారి మధ్య పెరిగిన విశ్వాసం ప్రేమగా మారింది. రైల్వే ప్లాట్‌ఫారమ్ నుంచి మొదలైన వారి ప్రయాణం తాజాగా వివాహ బంధంగా మారి ముందుకు సాగుతోంది.
News December 10, 2025
మొక్కల్లో నత్రజని లోపాన్ని ఎలా గుర్తించాలి?

మొక్క ఎదుగుదల, పూత, పిందె రావడం, కాయ పరిమాణం ఎదుగుదలలో నత్రజని కీలకపాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల మొక్క పెరుగుదల, పూత, కాపు కుంటుపడుతుంది. ఆకులు చిన్నగా మారతాయి. ముదిరిన ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. మొక్కల ఎదుగుదల తగ్గి, పొట్టిగా, పీలగా కనిపిస్తాయి. పంట దిగుబడి తగ్గుతుంది. ఒకవేళ నత్రజని అధికమైతే కాండం, ఆకులు ముదురాకు పచ్చగా మారి చీడపీడల ఉద్ధృతి పెరుగుతుంది. పూత, కాపు ఆలస్యమవుతుంది.
News December 10, 2025
ఈ నెల 12న ఆన్‌లైన్ జాబ్ మేళా

AP: పార్వతీపురం మన్యంలో ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో డిసెంబర్ 12న ఆన్‌లైన్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 4 కంపెనీలు ఇంటర్వ్యూ ద్వారా 160 పోస్టులను భర్తీ చేయనున్నాయి. 18 ఏళ్లు నిండిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్ : https://forms.gle/vtBSqdutNxUZ2ESX8


