News September 1, 2024

BIG BREAKING: వరద బాధితులకు సాయం ప్రకటించిన సీఎం

image

AP: రాష్ట్రంలో రికార్డుస్థాయి వర్షాలు కురుస్తున్నాయని, నేషనల్ హైవేలు కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు. వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున పంచదార, ఆయిల్, ఉల్లి, బంగాళదుంపలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులకు అదనంగా 25 కేజీల బియ్యం ఇవ్వాలని సూచించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.

Similar News

News November 21, 2025

AIతో జవాబు పత్రాల వాల్యుయేషన్!

image

TG: విద్యార్థుల ఆన్సర్ షీట్లను లెక్చరర్లతోనే కాకుండా AI ద్వారా దిద్దించాలని రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రయోగాత్మకంగా పాలిటెక్నిక్‌లో 2 సబ్జెక్టుల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కావడంతో AI ద్వారా దిద్దిన పేపర్లను లెక్చరర్లతో మరోసారి చెక్ చేయించనున్నారు. రైటింగ్ ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. వాటిని ఏఐ ఎలా దిద్దుతుందనేది ఆసక్తికరం.

News November 21, 2025

శ్రీవారికి సుప్రభాత సేవ నిర్వహించేది ఇక్కడే..

image

తిరుమామణి మండపం దాటాక కనిపించే సుందర సన్నిధే బంగారు వాకిలి. ఈ వాకిలికి పూర్తిగా బంగారు రేకుల తాపడం ఉంటుంది. దీనికి ఇరువైపులా శ్రీవారి ద్వారపాలకులు అయిన జయవిజయుల పంచలోహ విగ్రహాలు దర్శనమిస్తాయి. శ్రీవారికి రోజూ చేసే తొలి సేవ అయిన సుప్రభాత సేవ ఈ బంగారు వాకిలి దగ్గరే మొదలవుతుంది. అన్నమాచార్యులు తమ కీర్తనల్లో ‘కనకరత్నకవాటకాంతు లిరుగడ గంటి’ అని వర్ణించింది కూడా ఈ దివ్య బంగారు వాకిలినే. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 21, 2025

TG వెదర్ అప్‌డేట్.. ఈనెల 23 నుంచి వర్షాలు

image

TG: రాష్ట్రంలో ఈనెల 23 నుంచి 25 వరకు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు పొడి వాతావరణం నెలకొంటుందని, రాబోయే 2 రోజుల్లో పలు చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా ఉంటాయని వెల్లడించింది. నేడు ADB, JGL, KMR, ASF, MNCL, MDK, NML, NZB, SRCL, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11-15°C ఉంటాయని, మిగతా జిల్లాల్లో >15°Cగా నమోదవుతాయని తెలిపింది.