News October 8, 2024
BIG BREAKING: ఆధిక్యంలో కాంగ్రెస్

హరియాణా ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. 14 చోట్ల కాంగ్రెస్, 9 చోట్ల బీజేపీ లీడ్‌లో ఉంది. జమ్మూకశ్మీర్‌లో NC-INC 12, బీజేపీ 11, పీడీపీ ఒక చోట, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నారు.
Similar News
News March 31, 2026
పెళ్లికి ముందు ఈ టెస్టులు చేయించుకోండి!

పెళ్లికి జాతకాలతో పాటు మెడికల్ టెస్టులు చేయించుకోవడం కూడా ఎంతో ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ‘బ్లడ్ గ్రూప్, హిమోగ్లోబిన్ స్థాయులు, HIV, హెపటైటిస్-B &C, VDRL, రుబెల్లా వంటి పరీక్షలు కాబోయే జంటలు చేయించుకోవాలి. ఇవి దంపతుల ఆరోగ్యానికే కాకుండా, పుట్టబోయే బిడ్డలకు జన్యుపరమైన లోపాలు, ప్రాణాంతక వ్యాధులు రాకుండా రక్షణనిస్తాయి’ అని చెబుతున్నారు. SHARE IT
News March 31, 2026
బాలామృతమా… బాలల పాలిట విషమా!

TG: అంగన్వాడీ సెంటర్లలో అందిస్తున్న పాలపొడి, ఇతర పదార్థాలు విషతుల్యంగా మారుతున్నాయి. కాలంచెల్లిన సరకుకు కొత్త లేబుల్స్ అంటించి కాంట్రాక్టర్లు అందిస్తున్నారు. వీటిలో ఫంగస్, బాక్టీరియా ఉన్నట్లు స్టేట్ ఫుడ్ ల్యాబ్ రిపోర్ట్ తేల్చింది. కమీషన్ల మత్తులో అధికారులు చర్యలకు బదులు హెచ్చరికలతో సరిపెడుతున్నారు. 35700కు పైగా అంగన్వాడీ కేంద్రాలుండగా వీటిలో పోషకాహారానికి FY25-26లో GOVT ₹156 CR ఇచ్చింది.
News March 31, 2026
కోకాకోలా బాటిళ్లకు ఎల్లో క్యాప్స్.. ఎందుకంటే?

కోకాకోలా బాటిళ్లకు ఎరుపు/ బ్లూ రంగు క్యాప్స్ ఉండటం కామన్. అయితే యూదుల ‘పాసోవర్’ పండుగ(Apr 1-9) సందర్భంగా పసుపు రంగు క్యాప్స్‌తో స్పెషల్ ఎడిషన్‌ను కోకాకోలా విడుదల చేసింది. సాధారణ కోకాకోలాలో మొక్కజొన్న సిరప్ వాడుతారు. కానీ ఈ పండుగ సమయంలో యూదులు మొక్కజొన్న ఉత్పత్తులకు దూరంగా ఉంటారు. దీంతో చక్కెరతో చేసిన ‘కోషర్’ వెర్షన్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. వీటికి పసుపు రంగు క్యాప్‌లను ఉపయోగించింది.


