News December 21, 2024
BIG BREAKING: రాష్ట్రంలో మళ్లీ భూప్రకంపనలు
AP: ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో స్వల్ప భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, ముండ్లమూరు, మారెళ్ల, తూర్పుకంభంపాడు, శంకరాపురం సహా పలుచోట్ల కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ముండ్లమూరు స్కూలు నుంచి విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.
Similar News
News December 21, 2024
బీఆర్ఎస్ వాళ్లను ఉరి తీసినా తప్పులేదు: సీఎం రేవంత్
BRS సర్కారు 11.5 శాతం వడ్డీకి అప్పులు తెచ్చి సర్కారుపై భారం మోపిందని CM రేవంత్ ఆరోపించారు. ‘వీళ్లను ఉరి తీసినా తప్పులేదు. అనేక బ్యాంకులు 2 నుంచి 4శాతానికి అప్పులిస్తుంటే వీళ్లు 11.5శాతానికి అప్పు తెచ్చారు. రూ.వేలాది కోట్లు వడ్డీలు కడుతున్నాం. ఇతర దేశాల్లో ఇంత ఆర్థిక నేరానికి పాల్పడి ఉంటే ఉరి తీసి ఉండేవారు. దుబాయ్లాంటి దేశాల్లో బజార్లో రాళ్లతో కొట్టి చంపి ఉండేవారు’ అని మండిపడ్డారు.
News December 21, 2024
పాతకార్లు, పాప్కార్న్పై GST పెంపునకు మండలి ఆమోదం?
ఎలక్ట్రిక్ సహా పాత కార్ల అమ్మకాలపై GST రేటును పెంచుతున్నారని సమాచారం. ఈ లావాదేవీలపై పన్నును 12 నుంచి 18%కి సవరించేందుకు మండలి ఆమోదం తెలిపినట్టు ET పేర్కొంది. 50% పైగా ఫ్లైయాష్ ఉండే కాంక్రీట్ బ్లాకులపై పన్నును 18 నుంచి 12కు తగ్గించారని తెలిపింది. ఉప్పు, మసాలా దట్టించిన రెడీ టు ఈట్ పాప్కార్న్పై 5%, ప్రీప్యాక్డ్, లేబుల్ వేస్తే 12%, కారమెల్ వంటి షుగర్ కోటింగ్ వేస్తే 18% GST వర్తిస్తుందని సమాచారం.
News December 21, 2024
వారసత్వ పన్ను అవసరమే: యంగ్ బిలియనీర్
భారత్లో వారసత్వ పన్ను అవసరమేనని జెరోదా ఫౌండర్, బిలియనీర్ నితిన్ కామత్ అంటున్నారు. సమాజానికి పంచకుండా తరతరాలుగా సంపద ఒకేదగ్గర పోగుపడటం సబబు కాదన్నారు. ‘ఒక తరం సంపదను పొందిన ప్రతిసారీ దానిపై కొంత పన్ను చెల్లించడం సరైనదే. భారత్లో దీన్ని అమలు చేయడం సవాలే. కానీ ఏదో ఒక మార్గం వెతకాలి. సంపదను తిరిగివ్వడానికి సంపన్నులు మరింత కృషి చేయాలనేదే నా సలహా’ అని అన్నారు. కామత్ Podcastల్లో మాట్లాడటం తెలిసిందే.