News April 7, 2024
BIG BREAKING: సీఎం జగన్కు ఈసీ నోటీసులు

AP: సీఎం జగన్కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని టీడీపీ చేసిన ఫిర్యాదుతో 48 గంటల్లో వివరణ ఇవ్వాలని జగన్కు సీఈవో మీనా నోటీసులు ఇచ్చారు. ఈ నెల 3న పూతలపట్టు సిద్ధం సభలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.
Similar News
News January 5, 2026
తండ్రైన క్రికెటర్ అంబటి రాయుడు

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు తండ్రయ్యారు. ఆయన భార్య విద్య మగ పిల్లాడికి జన్మనిచ్చారు. వారిద్దరితో దిగిన సెల్ఫీ ఫొటోను రాయుడు ఇన్స్టాలో పోస్ట్ చేశారు. కాగా విద్యను రాయుడు 2009లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పలు లీగుల్లో ఆడుతూ క్రికెట్ కామెంటరీ కూడా చేస్తున్నారు.
News January 5, 2026
అతి త్వరలోనే పెన్షన్ల పెంపు: మంత్రి

TG: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. అతి త్వరలోనే పెన్షన్ల పెంపు ఉంటుందని చెప్పారు. దివ్యాంగులకు బస్సుల్లో త్వరలోనే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి బధిర విద్యార్థులకు ఇంటర్, డిగ్రీ కాలేజీలను అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా దివ్యాంగుల పెన్షన్లను ₹4,016 నుంచి ₹6వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
News January 5, 2026
ఐశ్వర్యానికి కారకుడు శివుడా?

శివుడిని వైరాగ్యానికి మూర్తిగా భావిస్తాం. కానీ ఆయనే సకల సంపదలకు మూలమైన ‘ఐశ్వర్యేశ్వరుడు’. కుబేరుడికి ఉత్తర దిక్పాలకుడిగా, సంపదలకు అధిపతిగా ఉండే శక్తిని ప్రసాదించినది ఆ పరమశివుడే. ఆయన భక్తుల దారిద్ర్యాన్ని హరించి శుభాలను చేకూర్చే మంగళకారుడు. మనసు నిండా భక్తితో శివుడిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహంతో దారిద్ర్య బాధలు తొలగి భోగభాగ్యాలు చేకూరుతాయి. అందుకే శివుణ్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటారు.


