News March 16, 2024
BIG BREAKING: కవిత భర్తకు ఈడీ నోటీసులు

TS: ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. కవిత భర్తతో పాటు ముగ్గురు కవిత వ్యక్తిగత సిబ్బందికి కూడా ఈడీ అధికారులు నోటీసులు అందించారు. ఇప్పటికే నలుగురి ఫోన్లను సీజ్ చేశారు. నిన్న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. ఆయన వ్యాపార లావాదేవీలపై ఆరా తీసింది. ఈ నేపథ్యంలో తాజాగా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
Similar News
News December 29, 2025
2025లో తగ్గిన ఇళ్ల విక్రయాలు.. పెరిగిన విలువ!

2025లో ఇళ్ల అమ్మకాలు యూనిట్లపరంగా 14% తగ్గినా.. విలువ మాత్రం 6% పెరిగింది. సామాన్యులు కొనే బడ్జెట్ ఇళ్ల కంటే లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరగడమే దీనికి కారణం. మధ్యతరగతి జనం ఇళ్లు కొనడానికి కాస్త వెనకడుగు వేశారు. మరోవైపు ఆఫీస్ స్పేస్, కమర్షియల్ బిల్డింగుల లీజింగ్ మాత్రం అదరగొట్టింది. హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గి, బడ్జెట్‌లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటే మార్కెట్ మళ్లీ పుంజుకుంటుందని బిల్డర్లు ఆశిస్తున్నారు.
News December 29, 2025
ఉద్యోగుల అంశంపై హరీశ్‌రావుకు శ్రీధర్ బాబు కౌంటర్

TG: అసెంబ్లీలో ఉద్యోగుల అంశంపై BRS నేత హరీశ్‌రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ‘ఆరు DAలు పెండింగ్‌లో ఉన్నాయి. రెండేళ్లయినా PRC లేదు. పోలీసులకు సరెండర్ లీవ్స్ ఇవ్వలేదు. ఉద్యోగులను కాంగ్రెస్ మోసం చేస్తోంది’ అని హరీశ్ విమర్శించారు. అయితే ఉద్యోగుల గురించి BRS మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి శ్రీధర్ కౌంటర్ ఇచ్చారు. గత పాలకులు 20వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
News December 29, 2025
జిల్లాల పునర్విభజనకు క్యాబినెట్ ఆమోదం

AP: జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లాల సంఖ్య 28కి చేరింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకి మార్చింది. రాయచోటిని మదనపల్లె జిల్లాకు, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాకు, రాజంపేటను కడప జిల్లాకు, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరుకు మార్చేందుకు ఆమోదం తెలిపింది.


