News May 1, 2024
BIG BREAKING: పోలింగ్ సమయం పెంపు

TG: తెలంగాణలో పోలింగ్ సమయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ప్రకటించింది. ఎండల తీవ్రత దృష్ట్యా రాజకీయ పార్టీల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నామని సీఈసీ వికాస్ రాజ్ తెలిపారు. మే 13న పోలింగ్ జరగనుంది. కాగా, అంతకుముందు ఉ.7 గంటల నుంచి సా.5 వరకే సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని సా.6 గంటల వరకు పొడిగించారు.
Similar News
News March 4, 2026
TPCC జాబితా: ఛాన్సు దక్కేదెవరికో!

TG: రాజ్యసభ సీటు కోసం INCలో పోటీ రసవత్తరంగా మారింది. రాష్ట్రం నుంచి సామాజిక వర్గాల వారీగా 16 పేర్లతో జాబితాను AICCకి పంపామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. వారిని ఢిల్లీకి పిలిచి మాట్లాడో లేదా ఫోన్లోనే చర్చించో తుది నిర్ణయం తీసుకోవచ్చన్నారు. కాగా VH, వేం నరేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి వంటి నేతలతో పాటు కొందరు ప్రముఖులనూ జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరికి ఛాన్సు దక్కుతుందో చూడాల్సిందే.
News March 3, 2026
‘హార్ముజ్’ సంక్షోభం.. ఇండియాకు అండగా రష్యా!

హార్ముజ్ జలసంధిని ఇరాన్ <<19285220>>మూసివేసిన<<>> నేపథ్యంలో ఇండియాకు సాయం చేసేందుకు రష్యా ముందుకొచ్చింది. చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే తాము క్రూడ్ పంపుతామని రష్యన్ వర్గాలు చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. మరోవైపు ఆయిల్ కొరత ఏర్పడితే రష్యా నుంచి ఇండియా దిగుమతులు పెంచవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియా క్రూడాయిల్, పెట్రోలియం <<19289613>>నిల్వలు<<>> 40-45 రోజులు వస్తాయని సమాచారం.
News March 3, 2026
అప్పుడు నా కెరీర్ ముగిసిందనుకున్నా: స్నేహ

తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ జీవితాన్ని తలకిందులు చేసిందని నటి స్నేహ వెల్లడించారు. ‘వరుస సినిమాలతో(2002) బిజీగా ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. తీవ్ర గాయాలవడంతో 8 నెలలు మంచానికి పరిమితమయ్యా. నా కెరీర్ ముగిసిందనుకున్నా. కానీ డైరెక్టర్ కరు పళనియప్పన్ “పార్థిబన్ కనవు”(2003) మూవీలో అవకాశం ఇవ్వడంతో మళ్లీ కెమెరా ముందుకు రాగలిగా’ అని ఇటీవల ఓ ప్రోగ్రామ్‌లో గుర్తుచేసుకున్నారు.


