News April 1, 2025
BIG BREAKING: కొత్త రేషన్‌కార్డులపై శుభవార్త

AP: మే నెల నుంచి ATM కార్డు సైజులో కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కుటుంబసభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డులకు ఆప్షన్లు ఇస్తామని చెప్పారు. QR కోడ్, ఇతర భద్రతా ఫీచర్లతో కొత్త కార్డులు జారీ చేస్తామన్నారు. ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయ్యాక ఎంతమందికి రేషన్‌కార్డులు ఇవ్వాలో స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే కొత్త కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు.
Similar News
News April 3, 2025
మారుతీ కార్లు కొనేవారికి షాక్

ఏప్రిల్ 8 నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. మోడల్‌ను బట్టి రూ.2,500 నుంచి రూ.62,000 వరకు ఈ పెంపు ఉంటుందని తెలిపింది. ముడి సరకుల ధరలు, ఆపరేషనల్ కాస్ట్ పెరగడం, కార్లలో మెరుగైన ఫీచర్స్ ఇందుకు కారణమని తెలిపింది. మోడళ్లపై ధరల పెరుగుదల ఇలా ఉంది. SUV Fronx-Rs.2500, Dzire Tour S-Rs.3000, XL6, Ertiga-Rs.12,500, Wagon R-Rs.14000, Eeco van-Rs.22,500, SUV Grand Vitara-Rs.62,000.
News April 3, 2025
IPL: టాప్-3లో ధోనీ, కోహ్లీ, రోహిత్

మార్చిలో Xలో అత్యధికంగా ప్రస్తావించిన ఐపీఎల్ ప్లేయర్ల లిస్టులో CSK మాజీ కెప్టెన్ ధోనీ తొలి స్థానంలో నిలిచారు. నెటిజన్లు గత నెలలో ఆయన గురించే ఎక్కువగా చర్చించారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య, SRH హిట్టర్ ట్రావిస్ హెడ్ ఉన్నారు.
News April 2, 2025
అదంతా అబద్ధం: సూర్య కుమార్

<<15971972>>జైస్వాల్‌తో పాటు<<>> తాను కూడా ముంబై నుంచి గోవా జట్టుకు మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని సూర్య కుమార్ యాదవ్ ఖండించారు. ‘మీరు జర్నలిస్టులా? స్క్రిప్ట్ రైటర్లా? నేను కామెడీ సినిమాలు చూడటం మానేసి ఇక నుంచి మీ ఆర్టికల్స్ చదువుతా’ అంటూ X వేదికగా స్పందించారు. సూర్యతో పాటు మరికొంత మంది క్రికెటర్లు గోవా జట్టులో చేరుతారని, HYD క్రికెటర్ తిలక్ వర్మనూ గోవా క్రికెట్ అసోసియేషన్ సంప్రదించినట్లు వార్తలొచ్చాయి.