News October 4, 2024
BIG BREAKING: భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మరణించారు. సరిహద్దుల్లో మావోలు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారంతో బలగాలు కూంబింగ్ చేపట్టారు. వారికి మావోలు తారసపడటంతో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. కాగా ఈ ఏడాది జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 180 మంది మావోయిస్టులు మరణించారు.
Similar News
News January 25, 2026
‘మన్ కీ బాత్’లో అనంతపురం ప్రస్తావన

AP: ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలోని అనంతపురం గురించి ప్రస్తావించారు. నీటి ఎద్దడి పరిష్కారానికి అక్కడి ప్రజల శ్రమను అభినందించారు. ఏపీ ప్రభుత్వ సహకారంతో పదికి పైగా జలాశయాలను పునరుద్ధరించారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో 7 వేలకు పైగా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు బాటలు వేశారని పొగిడారు. కాగా ప్రధాని మోదీ 130వ ‘మన్ కీ బాత్’లో ఈరోజు మాట్లాడారు.
News January 25, 2026
‘సభా సార్’తో గ్రామసభ రికార్డుల డిజిటలైజేషన్

TG: రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గ్రామసభల్లో ‘సభా సార్’ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించాలని కేంద్రం కోరింది. దీంతో సమావేశాల్లో చర్చించిన అంశాల ఆడియో/వీడియో రికార్డింగ్స్‌తో ఆటోమేటిక్‌గా సమావేశ మినిట్స్ రూపొందించవచ్చని తెలిపింది. దీని వల్ల శ్రమ తగ్గి, పారదర్శకత పెరుగుతుందని తెలిపింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది.
News January 25, 2026
పద్మ అవార్డుల ప్రకటన

వివిధ రంగాల్లో సేవలందించిన 45 మంది వ్యక్తులకు కేంద్రం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. జాబితాలో తెలంగాణకు చెందిన మామిడి రామరెడ్డి(పాడి, పశుసంవర్ధక విభాగం), డాక్టర్ కుమారస్వామి తంగరాజ్(జన్యు సంబంధ పరిశోధనలు), తమిళనాడుకు చెందిన నటేశన్ తదితరులు ఉన్నారు.


