News May 26, 2024
BIG BREAKING: ఐపీఎల్ విజేత KKR

కోల్‌కతా నైట్‌రైడర్స్ IPL-2024 విజేతగా నిలిచింది. SRHతో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడోసారి టైటిల్ కైవసం చేసుకుంది. SRH ఇచ్చిన 114 పరుగుల టార్గెట్‌ను కేవలం 10.3 ఓవర్లలోనే ఛేదించింది. వెంకటేశ్ అయ్యర్ 52*, గుర్బాజ్ 39 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించారు.
Similar News
News November 8, 2025
అసోసియేషన్ల తీరుతో నష్టపోతున్న క్రీడాకారులు!

AP: ఇటీవల DSCలో స్పోర్ట్స్ కోటా కింద కొందరు ఉద్యోగానికి అనర్హులయ్యారు. గుర్తింపులేని అసోసియేషన్లతోనే క్రీడాకారులు నష్టపోతున్నారని శాప్ తెలిపింది. APలో మొత్తం 63 స్పోర్ట్స్ అసోసియేషన్లు ఉండగా.. అందులో శాప్ గుర్తించినవి 35 మాత్రమే. గుర్తింపులేని వాటి తరఫున సర్టిఫికెట్లు సాధించినా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ఈ విషయం ముందే తెలుసుకుని గుర్తింపులేని అసోసియేషన్ల తరఫున ఆడొద్దని సూచిస్తున్నారు.
News November 8, 2025
MP సాన సతీశ్‌పై CM చంద్రబాబు ఆగ్రహం!

AP: గన్నవరం విమానాశ్రయంలో WC విన్నర్ శ్రీ చరణికి స్వాగతం పలికే విషయంలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. విమానాశ్రయానికి మంత్రులు, శాప్, ACA ప్రతినిధులు వెళ్లారు. శ్రీ చరణి ఉన్న లాంజ్‌లోకి BCCI మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్‌ని ప్రోటోకాల్ పోలీసులు వెళ్లనివ్వలేదు. దీనిపై MSKతో CM మాట్లాడారు. MP, ACA సెక్రటరీ సానా సతీశ్‌పై CM ఆగ్రహించినట్లు సమాచారం. ఇలాంటివి రిపీటవ్వకుండా చూసుకోవాలని ACAను ఆదేశించారు.
News November 8, 2025
నవంబర్ 8: చరిత్రలో ఈరోజు

1948: గాంధీని హత్య చేసినట్లు అంగీకరించిన గాడ్సే
2016: పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన కేంద్రం
1656: తోకచుక్కను కనుగొన్న సైంటిస్ట్ ఎడ్మండ్ హేలీ జననం
1927: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ జననం
1969: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జననం
1977: డైరెక్టర్ బీఎన్ రెడ్డి మరణం
2013: కమెడియన్ ఏవీఎస్ మరణం


