News June 30, 2024

BIG BREAKING: T20 క్రికెట్‌కు జడేజా వీడ్కోలు

image

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బాటలోనే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ T20 క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ‘కృతజ్ఞతతో నిండిన హృదయంతో టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. ఇన్నేళ్లూ గర్వంతో దూసుకెళ్లే గుర్రంలా నా దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చా. ఇకపై ఇతర ఫార్మాట్లలో నా జర్నీ కొనసాగిస్తా. T20WC గెలవడమనే నా కల నిజమైంది. ఇది నా కెరీర్‌లో అత్యున్నత ఘనత’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.

Similar News

News November 13, 2025

విడాకుల తర్వాత భయాందోళనలకు గురయ్యా: సానియా

image

షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత తాను భయాందోళనలకు గురైనట్లు టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా చెప్పారు. ఆ సమయంలో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తనకు అండగా నిలిచారని ఓ టాక్ షోలో తెలిపారు. కఠిన సమయంలో తన ప్రాణ స్నేహితురాలు తోడుగా ఉన్నారన్నారు. మరోవైపు సానియాను ఆ పరిస్థితుల్లో చూసి భయపడ్డానని, ఏమైనా ఆమెకు తోడుగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు ఫరా ఖాన్ పేర్కొన్నారు. మాలిక్‌తో సానియా 2023లో విడిపోయారు.

News November 13, 2025

ఆగాకర సాగు.. ఇలా నాటితే ఎక్కువ ప్రయోజనం

image

ఆగాకరను విత్తనం, దుంపలు, తీగ కత్తిరింపుల ద్వారా ప్రవర్థనం చేస్తారు. 2-3 సంవత్సరాల వయసుగల దుంపలు నాటుటకు అనుకూలం. తీగ కత్తిరింపుల ద్వారా అయితే 2-3 నెలల వయసున్న తీగ కత్తిరింపులను ఎంచుకోవాలి. విత్తనం ద్వారా నాటుకోవాలంటే గుంతకు 4-5 విత్తనాలు నాటుకోవాలి. ఇవి పూతకు వచ్చినప్పుడు మగ మొక్కలను తీసి గుంతకు 2-3 ఆరోగ్యవంతమైన ఆడ మొక్కలను ఉంచాలి. దుంపల ద్వారా నాటడం రైతులకు శ్రేయస్కరం.

News November 13, 2025

స్వస్తివచనం ఎందుకు చేయాలి?

image

చేయబోయే పనులు విజయవంతం కావాలని, మనతో పాటు చుట్టూ ఉన్న అందరికీ మేలు కలగాలని కోరుతూ పలికే పవిత్ర ప్రార్థననే ‘స్వస్తి వచనం’ అంటారు. సంకల్పంతో కొన్ని ప్రార్థనలు చేయడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది. మన పనులకున్న అడ్డంకులు తొలగిపోతాయి. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తే, ఆ సానుకూల శక్తి తిరిగి మనకే బలాన్నిస్తుంది. లక్ష్యాలకు విజయాన్ని చేరుస్తుంది. అందుకే ఏ కార్యాన్ని మొదలుపెట్టినా స్వస్తివచనం తప్పక ఆచరించాలి.