News January 21, 2025
BIG BREAKING: జనసేనకు ఈసీ గుర్తింపు

జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఆ పార్టీకి గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపింది. ఇంతకాలం రిజిస్టర్డ్ పార్టీగా ఉన్న జనసేన.. గుర్తింపు పొందిన పార్టీగా మారడంతో ఆ గుర్తును ఇకపై ఎవరికీ కేటాయించరు. 2014లో ఆవిర్భవించిన జనసేన ఆ ఏడాది ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో రాజోలు ఎమ్మెల్యే సీటు గెలిచింది. 2024లో పోటీ చేసిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు సొంతం చేసుకుంది.
Similar News
News November 18, 2025
జనవరిలో కొత్త ITR ఫారాలు: CBDT

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం వచ్చే ఏడాది APR 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ చట్టంలో ఉన్న రూల్స్‌తో ITR ఫారాలను జనవరినాటికి అందుబాటులోకి తేనున్నట్లు CBDT వెల్లడించింది. పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యమని పేర్కొంది. కొత్త చట్టానికి అనుగుణంగా అకౌంటింగ్ సాఫ్ట్వేర్లలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇక సరైన రిఫండ్ క్లెయిమ్‌లను DECలోగా పరిష్కరిస్తామని వివరించింది.

రేపే అకౌంట్లలోకి రూ.7వేలు.. మీ పేరు ఉందా?

PM కిసాన్ 21వ విడత నిధులను కేంద్రం రేపు విడుదల చేయనుంది. అర్హులైన రైతుల ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.2 వేల చొప్పున ప్రధాని మోదీ జమచేస్తారు. అదే రోజున AP ప్రభుత్వం 2వ విడత అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతులకు రూ.5వేల చొప్పున అందించనుంది. దీంతో ఈ 2 పథకాలకు అర్హులైన రైతుల అకౌంట్లలో రేపు రూ.7వేలు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ అర్హతను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.