News August 2, 2024
BIG BREAKING: జాబ్ క్యాలెండర్ ప్రకటన

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఇందులో ఉద్యోగాల సంఖ్య ఉండదని, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ప్రకటిస్తామని తెలిపారు. ఇది కేవలం ప్రకటన మాత్రమేనని దీనిపై చర్చ ఉండదని అసెంబ్లీలో భట్టి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక TGPSCని ప్రక్షాళన చేశామని, కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని వివరించారు.
Similar News
News April 2, 2026
పెరగనున్న సీట్లు: రాజకీయాల్లో కొత్త జోష్

అనంతపురం జిల్లాలో <<19543084>>వార్డుల<<>> సంఖ్య పెరిగింది. త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు కూడా పెరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో మరిన్ని రాజకీయ అవకాశాలు దక్కనుండటంతో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరగడంతో పాలన మరింత చేరువవుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఈ మార్పు జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడమే కాకుండా, యువ నాయకత్వానికి సరికొత్త దారులు వేయనుంది.
News April 2, 2026
నేడు రాజ్యసభకు అమరావతి బిల్లు

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు నిన్న లోక్‌సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం లాంఛనమే కానుంది. అనంతరం బిల్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వద్దకు వెళ్తుంది. ఆమె ఆమోదముద్ర వేయగానే చట్ట రూపం దాలుస్తుంది. దీంతో ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి నిలిచిపోనుంది.
News April 2, 2026
ఆర్టెమిస్-2: చంద్రుడి కక్ష్యలోకి స్మార్ట్‌ఫోన్లు..

NASA చేపట్టిన ఆర్టెమిస్-2 <<19542665>>యాత్ర<<>> రికార్డులు సృష్టిస్తోంది. ఇది అపోలో-13 కంటే 3,345 మైళ్లు ఎక్కువ దూరం ప్రయాణించనుంది. అలాగే చంద్రుడి కక్ష్యలోకి వెళ్తున్న తొలి మహిళగా క్రిస్టినా కోచ్ చరిత్రకెక్కనున్నారు. రెండు మినీ వ్యాన్ల పరిమాణంలో ఉండే ఓరియన్ నౌకలో నలుగురు వ్యోమగాములు తమ వెంట స్మార్ట్‌ఫోన్‌లు తీసుకెళ్తుండటం విశేషం. 10 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో వీరు నింగి నుంచి సూర్య గ్రహణాన్ని వీక్షించనున్నారు.


