News September 19, 2025

BREAKING: జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం

image

సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ యాడ్ షూటింగ్‌లో తారక్ స్వల్పంగా గాయపడ్డట్లు ఆయన టీమ్ తెలిపింది. రెండు వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకుంటారని చెప్పింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Similar News

News January 19, 2026

కవిత కొత్త పార్టీకి సన్నాహాలు.. స్ట్రాటజిస్ట్‌గా పీకే

image

TG: జాగృతి చీఫ్ కవిత ఉగాది వేళ కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. ఆమె పార్టీ కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగారు. ఇటీవల 5 రోజులు హైదరాబాద్‌లోనే మకాం వేసి కొత్త పార్టీపై కవితతో చర్చలు జరిపారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. అంతేకాదు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లోని ఇద్దరు కీలక నేతలతో కూడా పీకే మాట్లాడినట్లు తెలుస్తోంది.

News January 19, 2026

మాఘ మాసంలో పర్వదినాలు

image

చంద్ర దర్శనం(JAN 20), లలితా వ్రతం(21), వసంత పంచమి(23), రథసప్తమి(25), భీష్మాష్టమి(26), మధ్వనవమి(27), అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం(28), భీష్మ ఏకాదశి(29), వరాహ ద్వాదశి వ్రతం, పక్ష ప్రదోషం(30), విశ్వకర్మ జయంతి(31), మాఘ పౌర్ణమి, సతీదేవి జయంతి(FEB 1), సౌభాగ్య వ్రతం(2), సంకష్టహర చవితి(5), మంగళవ్రతం(9), విజయ ఏకాదశి(13), తిల ద్వాదశి, పక్ష ప్రదోషం(14), మహాశివరాత్రి(15), ధర్మ అమావాస్య(17).

News January 19, 2026

చెట్ల వ్యర్థాలను సెకన్లలో ముక్కలు చేసే ఉడ్ చిప్పర్..

image

కొబ్బరి, పామాయిల్, ఇతర పంటల్లో కింద పడిన కొమ్మలు, నరికిన చెట్ల కాండాన్ని వేరే చోటుకు తరలించడం కష్టంగా మారి తోటలోనే వదిలేస్తుంటారు. ఈ వ్యర్థాల నిర్వహణకు ‘ఉడ్ చిప్పర్’ యంత్రం పరిష్కారం చూపింది. కొబ్బరి, పామాయిల్ మట్టలను, చెట్ల కొమ్మలను ఇది సెకన్లలో ముక్కలుగా చేసేస్తుంది. ఈ ముక్కలను మల్చించ్, కంపోస్ట్ తయారీ, ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. ఈ యంత్రానికి ఉండే చక్రాలతో ఇతర ప్రాంతాలకు సులభంగా తీసుకెళ్లవచ్చు.