News November 28, 2024
టెన్త్ పరీక్షల్లో ఇంటర్నల్స్ ఉండవు: ప్రభుత్వం
TG: టెన్త్ పరీక్షల మార్కుల విధానంలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 100 మార్కులకు పరీక్షలు నిర్వహించనుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కులు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇంటర్నల్స్‌కు 20 మార్కులు, రాత పరీక్షకు 80 మార్కులు ఇచ్చేవారు. గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో ఇంటర్నల్ మార్కులు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది.
Similar News
News November 28, 2024
తెలంగాణలో కొత్త మండలం.. మల్లంపల్లి
TG: ములుగు జిల్లాలోని మల్లంపల్లిని కొత్త మండలంగా ప్రకటిస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఎన్నికల సమయంలో మంత్రి సీతక్క మండలం ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో మల్లంపల్లి, రామచంద్రాపూర్ గ్రామాలతో ఈ మండలం ఏర్పాటు చేశారు. ములుగు రెవెన్యూ డివిజన్, జిల్లా పరిధిలోనే ఈ గ్రామం కొనసాగనుంది. పదేళ్లుగా స్థానికులు చేసిన పోరాటానికి ఫలితం దక్కిందంటూ సీఎం రేవంత్‌కు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.
News November 28, 2024
కాంగ్రెస్ అతివిశ్వాసమే కొంపముంచింది: ఉద్ధవ్ వర్గం
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి తరువాత విపక్ష MVAలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌లో ఏర్పడిన అతి విశ్వాసమే MVA కొంపముంచిందని శివసేన ఉద్ధవ్ వర్గం బహిరంగ విమర్శలకు దిగింది. ఎన్నికల ముందే కాంగ్రెస్ నేతలు మంత్రిత్వ శాఖలు పంచుకొనేందుకు కోట్‌లు, టైలు సిద్ధం చేసుకున్నారని మండిపడింది. ఉద్ధవ్‌ను సీఎంగా ప్రకటించివుంటే ఫలితాలు మరోలా ఉండేవని వాదిస్తోంది.
News November 28, 2024
ఆధార్ కార్డు ఉన్న వాళ్లకు ALERT
ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువు డిసెంబర్ 14వ తేదీతో ముగియనుంది. కార్డులోని వివరాలను డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసి వివరాలను ఉచితంగా మార్చుకోవచ్చు. డిసెంబర్ 14 తర్వాత మార్చుకోవాలంటే ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్‌డేట్ చేసుకోవాలి. మీరు మీ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకున్నారా?