News March 5, 2025

BIG BREAKING: ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థి విజయం

image

TG: ఆదిలాబాద్-కరీంనగర్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలుపొందారు. కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, బీఎస్పీ తరఫున ప్రసన్న హరికృష్ణ పోటీ చేశారు.

Similar News

News April 1, 2026

‘ఆయా షేర్’.. నాని ఊర మాస్ లుక్!

image

నేచురల్ స్టార్ నాని తన కొత్త సినిమా ‘ప్యారడైజ్’ కోసం చేసిన మేకోవర్ నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ చిత్రం కోసం ఆయన కండలు తిరిగేలా బాడీని బిల్డ్ చేశారు. తాజాగా జిమ్‌లో కసరత్తు సందర్భంగా దిగిన ఫొటోను ఆయన షేర్ చేయగా వైరలవుతోంది. నాని మాస్ లుక్ చూసి అభిమానులు ‘ఆయా షేర్’ అని పేర్కొంటూ ఆయన డెడికేషన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ప్యారడైజ్ మూవీ ఆగస్టు 21న విడుదలవనుంది.

News April 1, 2026

కళ్లు అదురుతున్నాయా? 7 కారణాలివే

image

కళ్లు అదరడం అనారోగ్య సమస్యకు సంకేతమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి/ఆందోళన, అలసట, కెఫిన్/ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం, పోషకాహార లోపం, పొల్యూషన్ వల్ల వచ్చే ఐ అలెర్జీ, మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వంటి 7 అంశాలు దీనికి కారణాలు కావచ్చని పేర్కొంటున్నారు. కళ్లు అదరడం వారానికి మించి కొనసాగితే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News April 1, 2026

అమరావతిని ఇంచు కూడా కదలించలేరు: CBN

image

AP: రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతేనని ఇక దాన్ని ఇంచు కూడా ఎవరూ కదిలించలేరని CM CBN వ్యాఖ్యానించారు. ‘అమరావతి బిల్లును లోక్‌సభలో ఇవాళ పెట్టారు. రేపు రాజ్యసభలో ఆమోదిస్తారు. గత పాలకులు అమరావతిని విధ్వంసం చేశారు. ఎడారి అని, శ్మశానమని ఎగతాళి చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు’ అని నెల్లూరు జిల్లా వింజమూరు సభలో విమర్శించారు. అటు తల్లికి వందనం నిధులను జూన్‌లో అందిస్తామని CBN తెలిపారు.