News March 26, 2024
BIG BREAKING: ఎమ్మెల్సీ కవితకు జుడీషియల్ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో BRS MLC కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 9 వరకు జుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను పోలీసులు తిహార్ జైలుకు తరలించనున్నారు. 10 రోజుల ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1న విచారణ చేస్తామని న్యాయమూర్తి తెలిపారు.
Similar News
News March 19, 2026
హార్ముజ్ మాత్రమే కాదు మరో రూట్ పైనా ఇరాన్ అటాక్!

ఇరాన్‌లోని అతిపెద్ద LNG ప్లాంట్ అయిన ‘సౌత్ పార్స్’పై నిన్న ఇజ్రాయెల్ దాడి చేయడంతో యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ ఫెసిలిటీస్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది. హార్ముజ్ జలసంధి మూసివేతతో సౌదీ ఎర్రసముద్ర తీరంలోని యన్బు పోర్ట్ ద్వారా చమురు ఎగుమతి చేస్తోంది. తాజాగా ఇరాన్ అక్కడి SAMREF ఆయిల్ రిఫైనరీపైనా అటాక్ చేసింది. దీంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.
News March 19, 2026
మరోసారి భారీగా పడిపోయిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో <<19423062>>బంగారం ధరలు<<>> మరోసారి భారీగా పడిపోయాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి ఏకంగా రూ.7,140 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రా. గోల్డ్ రేటు రూ.1,50,280 పలుకుతోంది. అటు 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.6,550 తగ్గి రూ.1,37,750కి చేరింది. ఇవాళ కేజీ వెండి రేటు రూ.10,000 తగ్గి రూ.2.65 లక్షలు పలుకుతోంది.
News March 19, 2026
ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు: CM CBN

AP: జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం అని CM CBN స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6L+ ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగిందన్నారు. ‘ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. <<19422391>>10,060 ప్రభుత్వ ఉద్యోగాలు<<>> భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలి’ అని ట్వీట్ చేశారు.


