News March 24, 2024
BIG BREAKING: ఫోన్ ట్యాపింగ్ సంచలన విషయాలు

TG: రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు సంచలన విషయాలు వెల్లడించారు. ‘ఉన్నతాధికారులు చెబితేనే ఎన్నికలప్పుడు వందలాది ఫోన్లు ట్యాప్ చేశాం. అందులో నేతలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులూ ఉన్నారు. BRS కీలక నేత కొన్ని నంబర్లు ట్యాప్ చేయమన్నారు. మెయిన్ ట్యాపింగ్ డివైజ్‌ను ధ్వంసం చేశాం. కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌లను విరిచి మూసీ నదిలో పడేశాం. కొన్ని పత్రాలు కాల్చేశాం’ అని తెలిపారు.
Similar News
News November 1, 2025
OCT జీఎస్టీ వసూళ్లు ₹1.96L కోట్లు

ఈ ఏడాది అక్టోబర్‌లో ₹1.96L కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్(₹1.87L కోట్లు)తో పోలిస్తే 4.6 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. రిఫండ్ల తర్వాత నెట్ కలెక్షన్లు ₹1.69L కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ఇక 2024 ఏప్రిల్-అక్టోబర్ మధ్య ₹12.74L కోట్లు వసూలవ్వగా, ఈ ఏడాది అదే సమయంలో 9 శాతం వృద్ధితో ₹13.89L కోట్లు ఖజానాలో చేరినట్లు వివరించింది.
News November 1, 2025
తొక్కిసలాట ఘటనపై అధికారుల వివరణ

AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై అధికారులు వివరణ ఇచ్చారు. ఇవాళ ఆలయానికి 15వేల మంది వచ్చారని వెల్లడించారు. ఘటనాస్థలిలో ఏడుగురు, పలాస ఆస్పత్రిలో ఇద్దరు మృతిచెందినట్లు చెప్పారు. ఘటనలో 13 మందికి గాయాలయ్యాయని, వారికి పలాస ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
News November 1, 2025
ప్రకృతి సేద్యంలో వరి సాగు – ఆకునల్లి, పచ్చదోమ నివారణ

☛ ఆకునల్లి నివారణకు గట్ల మీద బంతి మొక్కలు నాటాలి. పంట మీద ఆవుపేడ, ఆవు మూత్రం, ఇంగువతో చేసిన 5 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.
☛ పచ్చదోమ నివారణకు పసుపు, తెల్లని జిగురు అట్టలను ఎకరానికి 20-25 చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి ఒక లైట్ ట్రాప్ (దీపపు ఎర)ను పెట్టాలి. 100 లీటర్ల నీటికి 5లీటర్ల వావిలాకు కషాయాన్ని కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.


