News May 20, 2024
BIG BREAKING: ఇరాన్ అధ్యక్షుడు కన్నుమూత?
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతోపాటు విదేశాంగ మంత్రి కన్నుమూసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. వీరి మృతిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో అజర్ బైజాన్ సరిహద్దుల్లో ల్యాండింగ్ సమయంలో <<13277199>>హెలికాప్టర్<<>> నేలను బలంగా తాకిన విషయం తెలిసిందే.
Similar News
News December 23, 2024
BIG BREAKING: అల్లు అర్జున్కు పోలీసుల నోటీసులు
హీరో అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తర్వాత బన్నీని అరెస్ట్ చేయగా హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
News December 23, 2024
ఆ స్క్రిప్ట్ పట్టుకొని 14 ఏళ్లు తిరిగిన శ్యామ్ బెనగల్
1974లో విడుదలై జనాదరణ పొందిన అంకుర్ చిత్రాన్ని తీయడానికి శ్యామ్ బెనగల్ 14 ఏళ్లపాటు నిర్మాతల చుట్టూ తిరిగారు. సాంఘిక వివక్ష, పేదరికం, మహిళల హక్కుల నేపథ్యం కలిగిన ఈ చిత్రాన్ని చివరికి బ్లేజ్ ఫిలిం నిర్మించింది. తొలుత తెలుగులో తీయాలనుకున్నా నిర్మాతలు హిందీలో తీయడానికి శ్యామ్ బెనగల్ను ఒప్పించారు. ₹5 లక్షలతో సినిమా తీస్తే ₹కోటి వరకు వసూళ్లు సాధించి అప్పట్లో ఓ సంచలనంగా నిలిచింది.
News December 23, 2024
హైకోర్టులో KCR, హరీశ్ క్వాష్ పిటిషన్
TG: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. మేడిగడ్డ నిర్మాణంలో వీరిద్దరూ అవినీతికి పాల్పడ్డారంటూ భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. దీంతో కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను కొట్టేయాలంటూ KCR, హరీశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.