News November 30, 2024

పుష్ప-2 టికెట్ ధరలు భారీగా పెంపు

image

పుష్ప-2 సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ TG ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. DEC 4న రాత్రి 9.30, అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోలకు ఓకే చెప్పింది. వీటి టికెట్ ధరలను సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లో ₹800లుగా ఖరారు చేసింది. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ ₹150, మల్టీప్లెక్స్ ₹200 చొప్పున, డిసెంబర్ 9-16 వరకు సింగిల్ స్క్రీన్ ₹105, మల్టీప్లెక్స్ ₹150 చొప్పున పెంపునకు అనుమతిచ్చింది.

Similar News

News November 30, 2024

ప్రతిపక్షాల అబద్ధాలను తిప్పికొట్టాలి: మహేశ్

image

TG: ప్రతిపక్ష నేతలు ప్రచారం చేస్తున్న అబద్ధాలను తిప్పికొట్టాలని TPCC చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన పనులను చెప్పుకోకపోతే వెనుకబడిపోతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులకు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సూచించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కష్టపడ్డవారికి పార్టీలో గుర్తింపు, పదవులుంటాయన్నారు.

News November 30, 2024

‘పుష్ప-2’ ఒక్క టికెట్ ధర ఎంతంటే?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా టికెట్ బుకింగ్స్ తెలంగాణలో మరికొన్ని క్షణాల్లో ప్రారంభం కానుంది. పెరిగిన ధరలతో ఒక్కో టికెట్ ధర థియేటర్లను బట్టి మారుతుంటుంది. మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్ రేటు రూ.531, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.354, ప్రీమియర్ షోలకు రూ.1200గా ఉండనున్నట్లు తెలుస్తోంది. తొలి మూడు రోజులు మాత్రమే ఈ ధరలుండగా.. ఆ తర్వాత టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.

News November 30, 2024

మీకు తెలుసా: క్యారమ్స్ ఎక్కడ పుట్టిందంటే…

image

క్యారమ్స్ గేమ్ గురించి తెలియనివారు చాలా తక్కువగా ఉంటారు. స్నేహితులు, కుటుంబీకులతో ఆడుకునేందుకు అనువైన చక్కటి టైమ్ పాస్ గేమ్ ఇది. ఈ ఆట భారత్‌లోనే పుట్టింది. 20వ శతాబ్దం మొదట్లో రాజకుటుంబాలు ఈ ఆటను ఆడేవి. 1935లో భారత్, శ్రీలంక కలిసి తొలిసారిగా క్యారమ్స్ టోర్నీ నిర్వహించాయి. ఆ తర్వాత 1988లో అంతర్జాతీయ క్యారమ్ ఫెడరేషన్ చెన్నైలో ఏర్పడింది. పటియాలా ప్యాలెస్‌లో నేటికీ అద్దపు క్యారమ్ బోర్డు ఉంది.