News January 8, 2025
BIG BREAKING: ఇంటర్ పరీక్షల్లో సమూల మార్పులు
AP: ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రతిపాదించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను తొలగిస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. బోర్డు కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుందని చెప్పారు. ఈ నెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. 2025-26 నుంచి ఇంటర్లో సైన్స్ సబ్జెక్టుల్లో NCERT సిలబస్ ప్రవేశపెడతామని తెలిపారు.
Similar News
News January 9, 2025
స్పేస్ డాకింగ్ ప్రయోగం మరోసారి వాయిదా: ఇస్రో
స్పేస్ డాకింగ్ ప్రయోగం(స్పేడెక్స్) మరోసారి వాయిదా పడినట్లు ISRO తెలిపింది. ఉపగ్రహాల కదలిక చాలా నెమ్మదిగా ఉందని, ఊహించిన దానికంటే వాటి మధ్య దూరం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఉపగ్రహాలు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది. తదుపరి డాకింగ్ తేదీని మాత్రం ISRO వెల్లడించలేదు. 2 ఉపగ్రహాలను భూకక్ష్యలో అనుసంధానించడమే లక్ష్యంగా ఈ నెల 7న జరగాల్సిన ప్రయోగం నేటికి, నేడు మరోసారి వాయిదా పడింది.
News January 9, 2025
నేడు మీ టికెట్ యాప్ సేవలు ప్రారంభం
TG: సమయాన్ని వృథా చేయకుండా ఉన్న చోటు నుండే టికెట్లు బుక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీ టికెట్ యాప్ తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్ సేవలను ప్రభుత్వం నేడు ప్రారంభించనుంది. దీని ద్వారా రాష్ట్రంలోని జూ పార్క్లు, మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు, ఆలయాలు, పార్కులు, క్రీడలకు సంబంధించిన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దీంతో సులభంగా ప్రవేశం పొందవచ్చని పేర్కొంది.
News January 9, 2025
తిరుపతి బాధితులకు నేడు పరిహారం ప్రకటన
AP: తిరుపతి తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాలకు నేడు CM చంద్రబాబు పరిహారం ప్రకటిస్తారని TTD ఛైర్మన్ B R నాయుడు తెలిపారు. ఘటనపై ఆయన చాలా సీరియస్ అయ్యారని చెప్పారు. టోకెన్ కేంద్రం వద్ద ఉన్న DSP గేట్లు తెరవడంతో భక్తులందరూ తోసుకురావడం వల్లే ఘటన జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనం 19వరకు ఉంటుందని వెల్లడించారు.