News August 24, 2024

BIG BREAKING: నాగార్జునకు ఊరట.. కూల్చివేతలు ఆపాలన్న హైకోర్టు

image

TG: హైదరాబాద్ మాదాపూర్‌లో నటుడు <<13930726>>నాగార్జునకు<<>> చెందిన N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలు ఆపాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేతలు ఆపాలంటూ నాగార్జున దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ టి. వినోద్ కుమార్ ఈ తీర్పు వెల్లడించారు. కాగా, ఈ తీర్పు వచ్చేలోపే కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు, సిబ్బంది నేలమట్టం చేశారు.

Similar News

News October 16, 2025

చైనాపై 500% టారిఫ్స్ విధించాలి: బెస్సెంట్

image

US-చైనా ట్రేడ్ వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది. చైనాపై టారిఫ్స్‌ను 500%కి పెంచుతామని అమెరికా బెదిరిస్తోంది. ‘రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు 85మంది US సెనేటర్లు చైనాపై టారిఫ్స్‌ను 500%కి పెంచేందుకు ట్రంప్‌కు అధికారమివ్వాలని చూస్తున్నారు’ అని US ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. పైకి రష్యన్ ఆయిల్ పేరు చెబుతున్నా.. రేర్ ఎర్త్ మెటల్స్ కోసమే ఈ బెదిరింపులని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News October 16, 2025

యజ్ఞం ఎలా ఆవిర్భవించిందంటే?

image

మనిషి చేసే ఏ కార్యమైనా ఫలించాలంటే మానవ ప్రయత్నం మాత్రమే సరిపోదు. అందుకు దైవకృప కూడా తప్పనిసరిగా ఉండాలి. మన వేదం కూడా ఇదే విషయం చెబుతోంది. అందుకే దైవకృపను పొందడానికి వేదం యజ్ఞాన్ని ఆవిర్భవించింది. యజ్ఞం అంటే ఒంటరిగా చేసేది కాదు. అందరూ కలిసి చేయాలి. అప్పుడే అద్భుతమైన ఫలితం ఉంటుంది. పురోహితులు, యజమానులు.. ఇలా సమష్టి శ్రమ, కృషి వల్లే యజ్ఞం విజయవంతం అవుతుంది. <<-se>>#VedikVibes<<>>

News October 16, 2025

భారత్‌పై WTOకి చైనా ఫిర్యాదు

image

ఇండియా అమలు చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్, EV బ్యాటరీ సబ్సిడీలపై చైనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు ఫిర్యాదు చేసింది. ఇది దేశీయ తయారీదారులకు అన్యాయమైన ప్రయోజనాన్ని కల్పిస్తోందని, చైనా ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించింది. తమ దేశీయ పరిశ్రమల ప్రయోజనాలు, హక్కుల కోసం కఠిన చర్యలు తీసుకుంటామని వారి వాణిజ్య శాఖ హెచ్చరించింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే IND అధిక సబ్సిడీలు అందిస్తోందని అసహనం వ్యక్తం చేసింది.