News March 16, 2024
BIG BREAKING: ఫలితాలు విడుదల

గేట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ లాగిన్ వివరాల ద్వారా ఫలితాలను పొందవచ్చు. ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో రెండు షిఫ్టుల్లో దేశ వ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించారు. ఫలితాల కోసం ఇక్కడ <
Similar News
News December 28, 2025
న్యూ ఇయర్ పార్టీ చేసుకునే వారికి హెచ్చరిక

TG: న్యూ ఇయర్ పార్టీల్లో మద్యం వినియోగానికి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ హెచ్చరించారు. జనవరి 1 వరకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(NDPL)తో పాటు డ్రగ్స్ అమ్మకాలు, వినియోగాలపై తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. NDP లిక్కర్‌ను రాష్ట్రంలోకి రాకుండా అన్ని మార్గాల్లో నిఘా పెట్టి నిలువరించాలని అధికారులను ఆదేశించారు.
News December 28, 2025
టీ20ల్లో హయ్యెస్ట్ స్కోర్.. ఉమెన్స్ టీమ్ రికార్డ్

శ్రీలంక ఉమెన్స్ జట్టుతో జరుగుతున్న 4వ టీ20లో టీమ్ ఇండియా 221 రన్స్ చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. అంతర్జాతీయ T20 మ్యాచుల్లో మనకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. భారత్ 2024లో వెస్టిండీస్‌పై 217/4, ఈ ఏడాది నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌పై 210/5 రన్స్ చేసింది. అటు ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన-షెఫాలీ వర్మ కలిసి హయ్యెస్ట్ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్(162 రన్స్) నమోదు చేశారు.
News December 28, 2025
OpenAI సూపర్ ఆఫర్.. రూ.4.6 కోట్ల జీతం

OpenAI భారీ జీతంతో ఓ జాబ్ ఆఫర్ ప్రకటించింది. ‘హెడ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్’ అనే కీలక రోల్‌కు ఏటా 5.55 లక్షల డాలర్ల (సుమారు రూ.4.6 కోట్లు) జీతం ఇవ్వనున్నట్లు ఆ సంస్థ CEO సామ్ ఆల్ట్‌మన్ ప్రకటించారు. దీనికి సెలక్ట్ అయితే కొత్త AI మోడల్స్ వల్ల కలిగే సైబర్, భద్రతా ముప్పులను ముందే అంచనా వేసి నివారణ చర్యలను డిజైన్ చేయాలి. మెషిన్ లెర్నింగ్, AI సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి.


