News March 12, 2025

నిలిచిన SBI లావాదేవీలు.. కస్టమర్ల అసహనం

image

దేశ వ్యాప్తంగా SBI ఆన్‌లైన్ సేవలు బంద్ అయ్యాయి. UPI యాప్‌లో SBI అకౌంట్ నుంచి చేస్తున్న లావాదేవీలు నిలిచిపోయాయి. అలాగే SBI అకౌంట్ ఉన్న వారికి చేస్తున్న లావాదేవీలు సైతం ఫెయిల్ అవుతున్నాయి. నిన్న కూడా ఇలాంటి సమస్యే తలెత్తి యూజర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇవాళ కూడా మళ్లీ అదే తరహా సమస్య రావడంతో దేశంలో అతిపెద్ద బ్యాంక్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీకూ ఇలాంటి సమస్యే ఎదురైందా? కామెంట్ చేయండి.

Similar News

News March 13, 2025

ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు

image

TG: ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఈ అథారిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. దీని పరిధిలో 56 రెవెన్యూ గ్రామాలు, 7 మండలాలు రానున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌‌కు ధీటుగా దీనిని ప్రభుత్వం ఫోర్త్ సిటీగా అభివర్ణిస్తోంది.

News March 13, 2025

నితీశ్ రాజీనామా చేసి ఆశ్రమానికి వెళ్లు: తేజస్వీ యాదవ్

image

బిహార్ సీఎం నితీశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. నితీశ్ రాష్ట్రాన్ని పాలించేందుకు ఫిట్‌గా లేరని దుయ్యబట్టారు. ఆయన ప్రవర్తన సరిగా లేదని, మహిళలను అవమానపరుస్తున్నారని తేజస్వీ ఆరోపించారు. నితీశ్ స్పృహ లేకుండా పాలన చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంటనే పదవికి రాజీనామా చేసి ఆశ్రమానికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

News March 13, 2025

మార్చి 13: చరిత్రలో ఈ రోజు

image

* 1899: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం
* 1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ మరణం
* 1940: జలియన్ వాలాబాగ్ కారకుడు మైఖెల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో హతమార్చాడు
* 1955: నేపాల్ రాజుగా పనిచేసిన త్రిభువన్ మరణం
* 1978: డైరెక్టర్ అనూషా రిజ్వీ జననం

error: Content is protected !!