News August 7, 2024

BIG BREAKING: వినేశ్ ఫొగట్‌కు షాక్

image

పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది. 50kgs విభాగంలో పోటీ పడుతున్న ఆమె ఎక్కువ బరువు ఉన్నారు. నిర్ణీత బరువుకన్నా 100 gms మించి బరువు ఉండడంతో ఫొగట్ డిస్‌క్వాలిఫై అయ్యారని ఆమె కోచ్ వెల్లడించారు. దీంతో ఫొగట్ మెడల్ ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి.

Similar News

News October 29, 2025

భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 110 అప్రెంటిస్‌లు

image

సంగారెడ్డిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (<>BDL<<>>)లో 110 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. www.apprenticeshipindia.gov.in పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థులు టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కులు, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. డిప్లొమా, ఇంజినీరింగ్ అభ్యర్థులు అనర్హులు. వెబ్‌సైట్: https://bdl-india.in/

News October 29, 2025

ఇంటి చిట్కాలు

image

* ఓవెన్‌ని క్లీన్ చేయడానికి ఒక బౌల్‌లో నిమ్మ ముక్కల్ని వేసి ఓవెన్‌లో పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత ఒక తడి క్లాత్‌తో ఓవెన్‌ని తుడిస్తే సరిపోతుంది.
* గ్లాస్‌ ఓవెన్‌ డోర్‌పై బేకింగ్‌ సోడా-నీళ్లు కలిపి రాసి పొడి క్లాత్‌తో తుడిస్తే మరకలు వదిలిపోతాయి.
* కిచెన్‌ సింక్, వాష్‌బేసిన్లపై పడే మరకలపై టూత్‌పేస్ట్‌ పూసి అరగంట పాటు అలాగే వదిలేయాలి. ఆపై స్పాంజ్‌తో రుద్ది కడిగేస్తే మరకలు సులభంగా వదిలిపోతాయి.

News October 29, 2025

60 మంది డ్రగ్ పెడ్లర్ల కాల్చివేత

image

2,500మంది బ్రెజిల్ పోలీసులు, జవాన్లు రియోలో డ్రగ్ ట్రాఫికింగ్ గ్యాంగ్‌పై సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. 60మంది అనుమానితులను కాల్చివేశారు. 81 మందిని అరెస్ట్ చేశారు. నలుగురు పోలీసులూ చనిపోయారు. 93 రైఫిల్స్, 500కిలోల డ్రగ్స్ సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో హెలికాప్టర్లు, ఆర్మ్‌డ్ వెహికల్స్‌ ఉపయోగించారు. ఈ దాడిని UN హ్యూమన్ రైట్స్ ఆఫీస్ ఖండించింది. విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది.