News August 9, 2024

BIG BREAKING: నీరజ్‌కు రజతం

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజతం గెలిచారు. ఫైనల్లో బల్లెం 89.45m దూరం విసిరి రెండో స్థానంలో నిలిచారు. పాక్ అథ్లెట్ నదీమ్ 92.97m బల్లెం విసిరి తొలి స్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకున్నారు. మరోవైపు ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి రజతం. దీంతో భారత పతకాల సంఖ్య ఐదుకు చేరింది.

Similar News

News March 10, 2026

భారత్ నుంచి బంగ్లాకు 5,000 టన్నుల డీజిల్?

image

ఇండియా నుంచి తమకు పైప్‌లైన్ ద్వారా 5,000 టన్నుల డీజిల్ రానుందని బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్ రెజనూర్ రెహ్మాన్ తెలిపారు. ఏటా 1,80,000 టన్నుల డీజిల్ సరఫరా కోసం భారత్‌తో ఒప్పందం ఉందని.. తాజా దిగుమతి అందులో భాగమేనన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో బంగ్లా ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. దీనిపై భారత్ స్పందించాల్సి ఉంది.

News March 10, 2026

నన్ను తిట్టి, కొట్టేవాడు.. మాజీ క్రికెటర్‌పై కోర్టుకెక్కిన భార్య

image

IND మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రాపై అతని భార్య గరిమా కాన్పూర్(UP) కోర్టును ఆశ్రయించారు. అమిత్, అతని ఫ్యామిలీ అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని పేర్కొన్నారు. అమిత్ తాగొచ్చి తిట్టి, కొట్టేవాడని, ఫుడ్ పెట్టకుండా వేధించేవాడని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ పిటిషన్‌పై కోర్టు త్వరలో విచారణ చేపట్టనుంది. షమీ కూడా గృహ హింస కేసు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

News March 10, 2026

అక్రిలిక్ నెయిల్స్‌తో క్యాన్సర్ ముప్పు

image

చేతులు అందంగా కనిపించాలని కొందరు అమ్మాయిలు అక్రిలిక్ నెయిల్స్ పెట్టించుకుంటారు. అయితే వీటిని డ్రై చేయడానికి వాడే ల్యాంపులు UVA కిరణాలను విడుదల చేస్తాయి. ఇవి DNAకి హాని కలిగించి చర్మ క్యాన్సర్‌కు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే నెయిల్ సెలూన్‌కి వెళ్లినపుడు సన్‌స్క్రీన్/ UV ప్రొటెక్టెడ్ గ్లౌజెస్ వాడటం, LED ల్యాంపులు (UV కాకుండా) ఉపయోగించే సలూన్‌లను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.