News October 1, 2024
BIG BREAKING: లడ్డూ అంశంలో సిట్ దర్యాప్తు నిలిపివేత

AP: తిరుమల లడ్డూ అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో ఎల్లుండి వరకు సిట్ దర్యాప్తును నిలిపివేసినట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. 3న ధర్మాసనం ఆదేశాల తర్వాత తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. లడ్డూలను కల్తీ నెయ్యితో తయారుచేశారనడానికి ఆధారాలు లేకుండానే సీఎం చంద్రబాబు ఎలా ప్రకటన చేశారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 19, 2026
వెకేషన్లో నయన్- త్రిష.. 40ల్లోనూ తగ్గని గ్లామర్!

స్టార్ హీరోయిన్లు నయనతార, త్రిష మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్లకు ఈ ఫొటోలతో చెక్ పడింది. దుబాయ్లో ఒక లగ్జరీ బోట్పై చిల్ అవుతున్న ఫొటోలను నయన్ షేర్ చేశారు. ‘ముస్తఫా ముస్తఫా don’t worry ముస్తఫా.. కాలం నీ నేస్తం ముస్తఫా’ అని రాసుకొచ్చారు. 40 ఏళ్లు దాటినా వీరి గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని, ఇప్పటికీ డ్రీమ్ గర్ల్స్లా మెరిసిపోతున్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు.
News January 19, 2026
CBN వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు: మంత్రి లోకేశ్

AP: ఏడాదిన్నరలో రాష్ట్రానికి రూ.23.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటివల్ల 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలొస్తాయని దావోస్లో మంత్రి లోకేశ్ తెలిపారు. అభివృద్ధి, ఐటీ, క్వాంటమ్ అంటూ ఏపీని సీబీఎన్ నడిపిస్తున్నారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారంటే ఆయనే కారణమన్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న 11 మంది ఏడుపుగొట్టు టీమ్ పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటోందని పరోక్షంగా వైసీపీని విమర్శించారు.
News January 19, 2026
ఇతిహాసాలు క్విజ్ – 128 సమాధానం

ప్రశ్న: అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్లడం తెలిసినా, బయటకు రావడం ఎందుకు తెలియదు?
సమాధానం: అభిమన్యుడు తన తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించే విధానం గురించి వివరిస్తుంటే విన్నాడు. అయితే, వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గాన్ని చెప్పే సమయానికి సుభద్ర నిద్రపోయింది. దీంతో గర్భంలో ఉన్న అభిమన్యుడికి లోపలికి వెళ్లడం మాత్రమే తెలిసింది. బయటకు రావడం తెలియలేదు.
<<-se>>#Ithihasaluquiz<<>>


