News July 2, 2024

3,035 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

image

TGSRTCలో 3,035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. డ్రైవర్-2,000, శ్రామిక్- 743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్)-114, డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్)-84, DM/ATM/మెకానికల్ ఇంజినీర్-40, అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్)-23, మెడికల్ ఆఫీసర్-14, సెక్షన్ ఆఫీసర్(సివిల్)-11, అకౌంట్స్ ఆఫీసర్-6, మెడికల్ ఆఫీసర్(జనరల్, స్పెషలిస్ట్)-14 ఉద్యోగాలున్నాయి.

Similar News

News January 16, 2025

హమాస్ చెరలో 100 మందికిపైగా బందీలు

image

ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 250 మందిని కిడ్నాప్ చేయగా ఇప్పటికీ వీరిలో 100 మందికి పైగా బందీలుగానే ఉన్నారు. వీరిని విడుదల చేసేందుకు అంగీకారం కుదిరినా కనీసం మూడింట ఒక వంతు మంది ప్రాణాలతో లేరని సమాచారం. ఇదే నిజమైతే ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

News January 16, 2025

కాల్పుల విరమణ: కీలక ప్రత్యర్థులను హతమార్చిన ఇజ్రాయెల్

image

హమాస్‌కు కౌంటర్‌గా ఇజ్రాయెల్ చేసిన దాడిలో గాజా నగరం శిథిలాలుగా మారింది. ఈ 15 నెలల్లో ఇజ్రాయెల్‌పై దాడుల ప్రధాన సూత్రదారి అబ్దల్ హదీ సబా, ఆ గ్రూప్ పొలిట్ బ్యూరో సభ్యుడు కసబ్‌ను చంపేసింది. మరో సూత్రధారి యహ్యా సిన్వర్, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియేతో పాటు కీలక నేతలను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. మరోవైపు హమాస్‌కు సహకరించిన హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాతో పాటు ఆ గ్రూప్‌లోని కీలక నేతలను చంపేసింది.

News January 16, 2025

ఆరు వారాలే ఒప్పందం!

image

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఆరు వారాల పాటు అమలులో ఉండనున్నట్లు అంతర్జాతీయ కథనాలు తెలిపాయి. దీనిలో భాగంగా ఇజ్రాయెల్ బలగాలు గాజాను వీడనున్నాయి. దీంతో పాటు ఇరు వర్గాలు బందీలను విడుదల చేసేందుకు పరస్పరం అంగీకారం తెలిపాయని వెల్లడించాయి.