News April 14, 2024
BIG BREAKING: పవన్ కళ్యాణ్‌పై రాయి విసిరిన వ్యక్తి

AP: గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రమాదం తప్పింది. వారాహి యాత్రలో పాల్గొన్న పవన్‌పై ఓ వ్యక్తి రాయి విసిరాడు. ఆ రాయి ఆయనకు తగలకుండా దూరంగా పడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రాయి విసిరిన వ్యక్తిని పట్టుకున్న జనసైనికులు పోలీసులకు అప్పగించారు.
Similar News
News February 5, 2026
CCRSలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

చెన్నైలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ <
News February 5, 2026
తక్కువ నీటి నిల్వ శక్తి గల భూముల్లో దిగుబడి పెరగాలంటే?

కొన్ని భూములకు నీటిని నిల్వ చేసుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం వీటిలో ఇసుక శాతం అధికంగా ఉండటంతో పాటు బంక మన్ను 20 శాతం కంటే తక్కువగా ఉండటమే. దీని వల్ల భూమిలో నీరు నిల్వ ఉండక, పోషకాలు మొక్కలకు అందక పంట దిగుబడి తగ్గుతుంది. ఇలాంటి భూముల్లో ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేయడం ద్వారా పై సమస్యను అధిగమించి మంచి దిగుబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
News February 5, 2026
నారా రోహిత్-అల్లరి నరేశ్ కాంబోలో కామెడీ ఎంటర్‌టైనర్?

టాలీవుడ్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కనుంది. అల్లరి నరేశ్, నారా రోహిత్ కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నట్లు సమాచారం. నారా రోహిత్‌తో ‘సుందరకాండ’ తీసిన వెంకటేశ్ నిమ్మలపూడి ఈ చిత్రానికి డైరెక్టర్‌గా, హరీశ్ పెద్ది నిర్మాతగా వ్యవహరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.


