News April 13, 2024

చిన్న అడుగులతో పెద్ద మార్పు

image

చిన్న అడుగులే పెద్ద మార్పునకు దారితీస్తాయని పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా తెలిపారు. మీ జీవితాన్ని క్రమంగా మార్చుకోవడానికి ఇవి పాటించండి అంటూ ఆయన పలు సూచనలు చేశారు.
★ రోజుకు 10 నిమిషాలైనా వ్యాయామం చేయండి
★ ఒక పేజీ అయినా చదవండి
★ కనీసం 30 సెకన్లు ధ్యానం చేయండి
★ భోజనంలో ఒక్క ఆరోగ్యకరమైన పదార్థాన్నైనా చేర్చండి
★ రోజుకోసారి ఫోన్‌ చూసే సమయాన్ని తగ్గించండి
★ రోజూ 10 నిమిషాలు ముందుగా నిద్రలేవండి

Similar News

News March 3, 2026

ఈ ప్రధాన పంటలకు ఈ ఎర పంటలతో మేలు

image

☛ వరి చుట్టూ జీలుగ వేసి కాండం తొలిచే పురుగు ఉద్ధృతి తగ్గించవచ్చు. ☛ మొక్కజొన్న చుట్టూ జొన్న మొక్కలను నాటి మొవ్వు ఈగ, కాండం తొలిచే పురుగును కట్టడి చేయొచ్చు. ☛ చెరకు పంట చుట్టూ కుంకుమ బంతి, సోయా చిక్కుడు వేసి నులి పురుగులను నివారించవచ్చు. ☛ పొగాకు చుట్టూ ఆముదం పంట వేసి పొగాకు లద్దె పురుగులను నియంత్రించవచ్చు. ☛ మిరప చుట్టూ ఆముదం పంట వేసి కాయతొలుచు పురుగులను కట్టడి చేయొచ్చు.

News March 3, 2026

ఏఐ కల్పిత తీర్పులపై సుప్రీంకోర్టు హెచ్చరిక

image

ఏఐ కల్పిత తీర్పులపై అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది. వాటి వల్ల న్యాయ ప్రక్రియ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలోని ఓ ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పులో అసలు ఉనికిలోనే లేని కేసు లాస్‌ను ప్రస్తావించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిని సీరియస్‌గా తీసుకుంది.

News March 3, 2026

సాయుధుల ఊచకోత.. 169 మంది మృతి

image

దక్షిణ సూడాన్‌లోని ఓ గ్రామంలో సాయుధులు జరిపిన దాడిలో 169 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధంలో భాగంగా ప్రతిపక్ష నేత రీక్ మచర్‌ మద్దతుదార్లు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 90 మంది సాధారణ పౌరులు చనిపోయారని.. మృతుల్లో పిల్లలు, మహిళలు ఉన్నట్లు UN మిషన్ వెల్లడించింది. ఈ దాడి తర్వాత వెయ్యి మంది తమను ఆశ్రయించినట్లు తెలిపింది. చర్చల ద్వారా ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేతలు సంధి కుదుర్చుకోవాలని కోరింది.