News November 12, 2024
BIG NEWS: యురేనియం తవ్వకాల నిలిపివేతకు ఆదేశాలు
కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యురేనియం తవ్వకాలను తక్షణమే ఆపేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆందోళనల దృష్ట్యా ఇప్పటికే తవ్వకాలు నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. కాగా, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా స్పష్టం చేశారు.
Similar News
News December 6, 2024
అనుమానాస్పద స్థితిలో తల్లీ, కూతురి మృతి
హోళగుంద మండలం హెబ్బటంలో గురువారం సాయంత్రం తల్లీ, కూతురు అనుమానాస్పద స్థితిలో మృతించెందారు. కంబదహాల్‌కు చెందిన సకరప్పకు, ఇంగళదహల్‌కు చెందిన సలీమా(21)కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఉపాధి కోసం రెండేళ్ల క్రితం హెబ్బటం వచ్చారు. వీరికి మూడేళ్ల కూతురు సమీరా ఉంది. గురువారం భార్యభర్తల మధ్య గొడవ జరిగిందని, నీ కూతురు, మనవరాలు చనిపోయి ఉన్నారని పక్కింటి వారు తమకు ఫోన్ చేసి చెప్పారని మృతురాలి తల్లి తెలిపారు.
News December 6, 2024
ఆదోనిలో టీచర్ భారతి ఆత్మహత్య
ఆదోనిలోని ప్రభుత్వ టీచర్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పట్టణంలోని పూల బజార్ వీధిలో నివాసముంటున్న ఎస్ఎం భారతి గురువారం సాయంత్రం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు భర్త శివ ప్రకాశ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఆదోని జనరల్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
News December 6, 2024
కర్నూలు: హంద్రీ నది పరిరక్షణ ఆవశ్యకత
హంద్రీ దినోత్సవం సందర్భం కర్నూలులోని పింగళి సూరన తెలుగు తోటలో ‘హంద్రీ నది పరిరక్షణ అవశ్యకత-తీసుకోవాల్సిన చర్యలు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గాడిచర్ల ఫౌండేషన్ అధ్యక్షుడు చంద్ర శేఖర కల్కుర, మానవశక్తి పరిశోధన కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య మన్సూర్ రెహమాన్ పాల్గొన్నారు. అనేక గ్రామాలకు, పట్టణాలకు, నగరాల పుట్టుకకు హంద్రీ నది కారణమైందన్నారు.