News March 7, 2025

BIG NEWS: కార్గిల్‌లో ల్యాండైన యుద్ధ విమానం!

image

LAC వద్ద భారత యుద్ధ విమానం C-17 MON రహస్యంగా ల్యాండైందని తెలిసింది. సముద్ర మట్టానికి 9700 ఫీట్ల ఎత్తైన కార్గిల్ పర్వత సానువుల్లో, ల్యాండింగ్‌కు కష్టమైన ప్రాంతానికి ఇది వెళ్లడం గమనార్హం. గతంలో వాయుసేన AN-32, C-130J సూపర్ హెర్కూల్స్‌ను ఇక్కడ ఉపయోగించింది. AN-32 కేవలం 3-4, C-130J 6-7 టన్నుల సామగ్రి, జవాన్లను తీసుకెళ్లగలవు. C-17 ఏకంగా 35 టన్నుల బరువును మోసుకెళ్లగలగడం విశేషం. ఇది ఆర్మీకెంతో బెనిఫిట్.

Similar News

News November 4, 2025

TODAY HEADLINES

image

* చేవెళ్లలో RTC బస్సును టిప్పర్ ఢీకొని 19 మంది మృతి.. రూ.7 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
* ఎన్ని అవాంతరాలు ఎదురైనా SLBC పూర్తి చేస్తాం: CM రేవంత్
* లండన్‌లో CM CBNతో హిందూజా గ్రూప్ ప్రతినిధుల భేటీ.. రూ.20వేల కోట్ల పెట్టుబడులకు ఓకే
* CII సమ్మిట్‌లో రూ.9.8 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు.. 7.5 లక్షల ఉద్యోగావకాశాలు: మంత్రి లోకేశ్
* WWC: ప్లేయర్లకు డైమండ్​ నెక్లెస్​ల బహుమతి

News November 4, 2025

దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్లు

image

AP: దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందజేయనున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ‘రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు, టెన్త్ పాసై స్వయం ఉపాధితో జీవించే వాళ్లు, 18-45 ఏళ్లలోపు వయసు, 70% అంగవైకల్యం, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అర్హులు. ఈనెల 25లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి’ అని తెలిపారు.

News November 4, 2025

‘పెద్ది’ మూవీ అప్డేట్ ఇచ్చిన AR రహ్మాన్

image

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీ నుంచి AR రెహమాన్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. రెహ్మాన్, బుచ్చిబాబు, మోహిత్ చౌహాన్ ఉన్న పిక్ షేర్ చేసి.. ‘ఏం ప్లాన్ చేస్తున్నారు?’ అని రామ్ చరణ్ ప్రశ్నించారు. అందుకు ‘చికిరి చికిరి.. చరణ్ గారు’ అని రెహమాన్ సమాధానమిచ్చారు. అంటే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కి రెడీ అవుతోందని చెప్పకనే చెప్పేశారు. అయితే రిలీజ్ ఎప్పుడో మాత్రం చెప్పలేదు.