News April 4, 2025
BIG NEWS: రేపటి మ్యాచ్‌కు CSK కెప్టెన్‌గా ధోనీ?

గత నెల 30న రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో గాయపడిన CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇంకా కోలుకోలేదని సమాచారం. రేపు ఢిల్లీతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ధోనీ మరోసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై యాజమాన్యం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Similar News
News April 12, 2025
దక్షిణాఫ్రికా ఆటగాడిపై PSLలో నిషేధం

సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కార్బిన్ బోష్‌పై పాకిస్థాన్ సూపర్ లీగ్ నిషేధం విధించింది. ఈ ఏడాది టోర్నీ కోసం పెషావర్ జల్మీ జట్టు అతడిని కొనుగోలు చేసింది. అయితే ముంబై ఇండియన్స్ ఆటగాడు లిజాడ్ విలియమ్స్ గాయపడటంతో అతడి రీప్లేస్‌మెంట్‌గా కార్బిన్‌ను MI తీసుకుంది. ఈ నేపథ్యంలో PSL నుంచి కార్బిన్ వైదొలిగారు. దీంతో వచ్చే ఏడాదికి కార్బిన్‌ను నిషేధిస్తున్నట్లు PSL యాజమాన్యం ప్రకటించింది.
News April 12, 2025
రొయ్యల మేత ధర కిలోకు రూ.4 తగ్గింపు

AP: పెరిగిన ఖర్చులు, ఎగుమతి కౌంట్ రేట్లు తగ్గిన నేపథ్యంలో ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టారు. దీంతో రొయ్యల మేత ధరను కిలోకు ₹4 చొప్పున ఫీడ్ కంపెనీలు తగ్గించాయి. <<16027501>>సీఎం చంద్రబాబు<<>> ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, నేటి నుంచి అమలు చేస్తామని వెల్లడించాయి. అయితే కిలోకు ₹20-25 తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందని రైతులు చెబుతున్నారు. కాగా రొయ్యల ధరలను తగ్గించొద్దని వ్యాపారులను ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
News April 12, 2025
ALERT: వడగాలులు బాబోయ్!

AP: రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నప్పటికీ వడగాలుల తీవ్రత మాత్రం పరాకాష్ఠకు చేరింది. మధ్యాహ్నవేళల్లో బయటికి రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఆ తీవ్రత కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈరోజు 66 మండలాల్లో వడగాడ్పులు వీయొచ్చని తెలిపింది. అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.