News March 4, 2025
బిగ్ న్యూస్.. ఈ నెలలలోనే మెగా డీఎస్సీ

AP: నిరుద్యోగులు ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలలోనే 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్కూళ్లు ఎక్కువ దూరంలో ఉన్న విద్యార్థులకు రవాణా భత్యం ఇస్తామని తెలిపారు. త్వరలో పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహిస్తామన్నారు.
Similar News
News March 6, 2026
TODAY HEADLINES

* ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదు: PM
* BJP చేతికి బిహార్ పగ్గాలు.. RSకు నితీశ్
* WB గవర్నర్ బోస్, లద్దాక్ LG కవీందర్ రిజైన్
* ఇద్దరు, ఆపై సంతానానికి రూ.25,000: CBN
* జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వబోం: అయ్యన్న
* కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు: పవన్
* TG: రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ నామినేషన్
* TG: HYDలో రేవంత్ ఒక్క ఇల్లూ కట్టలేదు: KTR
* T20WC.. ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
News March 6, 2026
తెలంగాణ కొత్త గవర్నర్ శుక్లా నేపథ్యం ఇదే

తెలంగాణ గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ఈయన 1952లో గోరఖ్పూర్(UP)లో జన్మించారు. 1983లో BJPలో చేరారు. 1989, 91, 93, 96లో గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2016-2022 వరకు ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2017-19 వరకు నరేంద్ర మోదీ క్యాబినెట్లో ఆర్థికశాఖ సహాయమంత్రిగా పని చేశారు. 2023 నుంచి ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు.
News March 6, 2026
యుద్ధం ఎఫెక్ట్.. పడిపోయిన కోడి గుడ్ల ధర!

అమెరికా-ఇజ్రాయెల్vsఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం మన దేశంలోని పౌల్ట్రీ రంగంపైనా పడింది. రోజుకు రూ.5 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో కోడి గుడ్ల నిల్వలు పెరిగి ధరలు దారుణంగా పడిపోయాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఒక్కో గుడ్డు ధరను రూ.4.30గా నిర్ణయించగా, స్థానిక మార్కెట్లలో రూ.3.50 పలుకుతోంది. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది.


