News December 23, 2024
BIG NEWS.. త్వరలో 32,438 ఉద్యోగాలకు నోటిఫికేషన్

రైల్వేలో 32,438 గ్రూప్-D ఉద్యోగాల భర్తీకి RRB త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. జనవరి 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. అత్యధికంగా ట్రాక్ మెయింటైనర్ ఉద్యోగాలు-13,187, పాయింట్స్మెన్-5058, అసిస్టెంట్(వర్క్షాప్)-3077, అసిస్టెంట్(C&W) సహా మరికొన్ని ఉద్యోగాలున్నాయి. 18-36 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ లేదా NCVT నుంచి NAC సర్టిఫికెట్, ITI ఉన్నవారు అర్హులు.
Similar News
News November 28, 2025
స్మృతితో పెళ్లిపై పలాశ్ తల్లి ఏమన్నారంటే..

స్మృతి మంధాన వివాహంపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ పలాశ్ ముచ్చల్ తల్లి అమృత స్పందించారు. త్వరలోనే పెళ్లి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఆ రోజు జరిగిన పరిణామాలపై ఇద్దరూ బాధపడుతున్నారు. మ్యారేజ్ అవగానే స్మృతికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేశాం. అనుకోని పరిస్థితులతో వివాహం వాయిదా వేశాం’ అని చెప్పారు. కాగా పెళ్లి సంబంధిత పోస్టులను స్మృతి డిలీట్ చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
News November 28, 2025
జపాన్ కామెంట్స్ ఎఫెక్ట్.. ఫ్రాన్స్ మద్దతుకు ప్రయత్నిస్తున్న చైనా

జపాన్తో వివాదం ముదురుతున్న వేళ ఫ్రాన్స్ మద్దతు కోసం చైనా ప్రయత్నిస్తోంది. ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మద్దతుగా నిలబడాలని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ దౌత్య సలహాదారుతో చైనా దౌత్యవేత్త వాంగ్ ఇ చెప్పారు. ‘వన్-చైనా’ విధానానికి ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నట్టు చెప్పారు. ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చించడానికి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వచ్చే వారం చైనా వస్తున్నారు.
News November 28, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.710 పెరిగి రూ.1,28,460కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 650 ఎగబాకి రూ.1,17,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,83,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


