News April 10, 2025
BIG NEWS: ఒలింపిక్స్‌లో T20 ఫార్మాట్ క్రికెట్

లాస్ఏంజెలిస్ 2028 ఒలింపిక్స్‌లో T20 ఫార్మాట్లో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో 6 టీమ్స్ చొప్పున పాల్గొంటాయి. ఒక్కో జట్టు నుంచి 15 మంది చొప్పున 90మంది క్రికెటర్లకు అనుమతినిస్తూ IOC నిర్ణయం తీసుకుంది. T20 ర్యాంకింగ్స్‌లో టాప్-6 జట్లు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. చివరిసారిగా 1900 పారిస్ ఒలింపిక్స్‌లో గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది.
Similar News
News January 6, 2026
చెక్ బౌన్స్ సమన్లు.. వాట్సాప్‌లోనూ పంపొచ్చు: ఉత్తరాఖండ్ హైకోర్టు

చెక్ బౌన్స్ కేసులకు సంబంధించిన సమన్లపై ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఫిజికల్‌గానే కాకుండా ఇకపై ఈమెయిల్, వాట్సాప్ లాంటి మెసేజింగ్ అప్లికేషన్లు, మొబైల్ ఫోన్ ద్వారా కూడా సమన్లను పంపవచ్చని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారు నిందితుడి వ్యక్తిగత ఈమెయిల్, వాట్సాప్ వివరాలను అఫిడవిట్ ద్వారా సమర్పించాలని పేర్కొంది. ఆటోమేటిక్‌గా సమన్లు వెళ్లేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని అధికారులకు సూచించింది.
News January 6, 2026
USలో ఏటా రూ.63 లక్షల కోట్ల ఫ్రాడ్: మస్క్

US మిన్నెసోటాలో ‘<<18728357>>డే కేర్ సెంటర్ల<<>>’ పేరిట $100 బిలియన్ల వరకు ఫ్రాడ్ జరిగి ఉంటుందన్న వార్తలపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మిన్నెసోటా కంటే కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లినాయిస్లో జరుగుతున్న ఫ్రాడ్ చాలా పెద్దది. నాకు తెలిసి దేశవ్యాప్తంగా ఏటా $700 బిలియన్స్(సుమారు రూ.63 లక్షల కోట్లు) స్కామ్ జరుగుతోంది’ అని ట్వీట్ చేశారు.
News January 6, 2026
ఆలివ్ రిడ్లీ తాబేళ్ల ‘ఇన్‌బిల్ట్ GPS’ సీక్రెట్!

ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పుట్టిన తీరానికే తిరిగొచ్చి గుడ్లు పెట్టడానికి ‘జియోమాగ్నెటిక్ ఇంప్రింటింగ్’ ప్రధాన కారణం. తీరానికి ఉండే ప్రత్యేక అయస్కాంత తీవ్రత, కోణాన్ని ఇవి పుట్టినప్పుడే మెదడులో నిక్షిప్తం చేసుకుంటాయి. ఈ ఇన్‌బిల్ట్ GPS సాయంతో వేల కి.మీ దూరం నుంచి గమ్యాన్ని గుర్తిస్తాయి. ఇసుక వాసన, నీటి రసాయన గుణాలు, ఖనిజాల సంకేతాలూ అందుకు సాయపడతాయి. అందుకే అవి కచ్చితంగా ఒడిశా, AP తీరానికి వస్తాయి.


