News February 14, 2026

Big Plan: హైదరాబాద్ మహా అవతారం!

image

HYD మరింత పెద్దది కాబోతోంది. ప్రస్తుతం HMDA పరిధి 7,257 చదరపు కిలోమీటర్లు ఉండగా దీన్ని 10,472 చదరపు KMకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ద్వారా 11 జిల్లాల పరిధిలోని RRR ప్రాంతాలన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయి. ముఖ్యంగా ‘ల్యాండ్ పూలింగ్’ (LADP) పద్ధతిలో 10 భారీ టౌన్‌షిప్‌ల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఈ విస్తరణ పూర్తయితే HYD దేశంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ ఏరియాల్లో ఒకటిగా మారుతుంది.

Similar News

News February 14, 2026

వేములవాడ జాతరకు తరలివస్తున్న భక్తులు

image

వేములవాడ మహాశివరాత్రి జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు మూట ముల్లెలతో తరలివస్తున్నారు. జాతర సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకొనేందుకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్, మహబూబాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలలో వేములవాడకు చేరుకుంటున్నారు.

News February 14, 2026

కొత్తగూడెం మేయర్ పీఠం కాంగ్రెస్‌దే..!

image

కొత్తగూడెం కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగం సిద్ధం చేసింది. స్వతంత్ర కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ పీఠంపై జెండా ఎగురవేయాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నిక ప్రక్రియను సమన్వయం చేసే బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. ఈ తరుణంలో మిత్రపక్షమైన సీపీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

News February 14, 2026

బిల్ గేట్స్‌ను మూడుసార్లు ఏపీకి తీసుకొచ్చిన ఘనత నాదే: సీఎం

image

AP: మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ ఎల్లుండి రాష్ట్రానికి రానున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయనను మూడుసార్లు APకి తీసుకొచ్చిన ఘనత తనదేనని ఎమ్మెల్యేలతో భేటీలో చెప్పారు. తొలిసారి హైటెక్ సిటీ, రెండోసారి విశాఖ అగ్రిటెక్, ఇప్పుడు సంజీవని పథకం కోసం పిలిపిస్తున్నామన్నారు. కాగా ఈ స్కీమ్ ద్వారా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో గ్రామీణ ఆరోగ్య సేవలు, వ్యాక్సినేషన్, మాతా శిశు సంరక్షణపై ప్రభుత్వం ఫోకస్ చేయనుంది.