News November 6, 2024

‘పుష్ప 2’ మేకర్స్ భారీ ప్లాన్?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రానున్న ‘పుష్ప 2’ మూవీ ప్రమోషన్లు భారీగా చేపట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 8 నగరాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు టాక్. పుణే, ఢిల్లీ, కోల్‌కతా, లక్నో, హుబ్లీ, చెన్నై, కొచ్చి, హైదరాబాద్‌తోపాటు దుబాయ్ లేదా అమెరికాలో ప్రెస్ మీట్లు, పబ్లిక్ ఈవెంట్లు నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 5న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Similar News

News April 10, 2026

ఓట్లతో రికార్డులు బద్దలుకొట్టారు!

image

ఇవాళ జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు అస్సాం, పుదుచ్చేరిలో ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ పర్సంటేజ్‌లో రికార్డులను బద్దలుకొట్టారు. అస్సాంలో ఇప్పటివరకు 84.67% అత్యధిక ఓటింగ్ కాగా ఇవాళ 85.38% నమోదైంది. పుదుచ్చేరిలో 89.83శాతంతో గత రికార్డ్‌(86.19%) బ్రేక్ అయింది. ఇక కేరళంలోనూ లాస్ట్ టైమ్(74.06%) కంటే ఈసారి(78.03%) అధిక పోలింగ్ నమోదైంది. ఈ రికార్డ్ ఓటింగ్‌ ఎవరికి కలిసొస్తుందో మే 4న ఫలితాలతో తేలనుంది.

News April 9, 2026

IPL: గ్రీన్ బౌలింగ్ చేశాడోచ్!

image

KKR ఆల్‌రౌండర్ గ్రీన్ ఎట్టకేలకు బౌలింగ్ చేశారు. రూ.25.2కోట్లు పెట్టి కొన్న ప్లేయర్ తొలి మూడు మ్యాచుల్లో బౌలింగ్ చేయకపోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. KKR యాజమాన్యంపైనా విమర్శలొచ్చాయి. కాగా ఇవాళ LSGతో మ్యాచులో ఆయన బౌలింగ్ చేసి 2వ బంతికే పంత్ వికెట్ తీశారు. అయితే వెన్ను‌నొప్పి నుంచి కోలుకుంటున్న గ్రీన్ ఫిట్‌నెస్ లేక బౌలింగ్ చేయట్లేదని CA ఇప్పటికే వివరణ ఇచ్చింది.

News April 9, 2026

రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఉత్తరాంధ్రలో <<19609767>>తీవ్ర వడగాలులు<<>> వీస్తాయని పేర్కొంది.