News December 16, 2024
BIG RECORD: BITCOIN @ Rs 90లక్షలు

క్రిప్టో కాయిన్లు తగ్గేదే లే అంటున్నాయి. గత 24 గంటల్లో రికార్డులు బ్రేక్ చేశాయి. నేడు బిట్‌కాయిన్ $1,06,648 (Rs 90L) జీవితకాల గరిష్ఠాన్ని అందుకుంది. $1,04,463 వద్ద మొదలైన BTC $1,04,324 వద్ద కనిష్ఠాన్ని తాకింది. $823 లాభంతో $1,05,287 వద్ద చలిస్తోంది. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ మళ్లీ $4000 స్థాయిని టచ్ చేసింది. లాభాల స్వీకరణతో USDT, XRP, SOL, BNB, DOGE, USDC, ADA, TRX, SHIB నష్టాల్లో ఉన్నాయి.
Similar News
News February 24, 2026
కష్టాల్లో భారత్.. 5 వికెట్లు డౌన్

ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో భారత అమ్మాయిలు తడబడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా 103 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ప్రతీకా రావల్ డకౌట్ కాగా షెఫాలీ 4, రోడ్రిగ్స్ 8, దీప్తి 2 రన్స్‌కే ఔట్ అయ్యారు. స్మృతి మంధాన మాత్రమే 58 పరుగులతో రాణించారు. కెప్టెన్ హర్మన్(26), రిచా(10) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 28 ఓవర్లకు 122/5.
News February 24, 2026
విజయ్-రష్మిక పెళ్లి.. ఇవాళే మెహందీ ఫంక్షన్!

రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి సందడి మొదలైంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు, బంధువులు, క్లోజ్ ఫ్రెండ్స్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చేరుకున్నారు. ఇవాళ మెహందీ ఫంక్షన్ జరగనున్నట్లు సమాచారం. రేపు హల్దీ, సంగీత్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఎల్లుండి హిందూ సంప్రదాయ ప్రకారం వీరిద్దరి వివాహం జరగనుంది. అత్యంత రహస్యంగా జరుగుతున్న ఈ వేడుకకు కేవలం 100 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లు వార్తలొస్తున్నాయి.
News February 24, 2026
చిన్నారి మృతి కేసులో ముగ్గురి అరెస్ట్

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో చిన్నారి <<19205888>>మృతికి<<>> కారణమైన నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. సర్పంచ్ తుకారాంరెడ్డి సహా మరో ఐదుగురు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. ప్రత్యేక బృందాలు వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.


