News December 16, 2024

BIG RECORD: BITCOIN @ Rs 90లక్షలు

image

క్రిప్టో కాయిన్లు తగ్గేదే లే అంటున్నాయి. గత 24 గంటల్లో రికార్డులు బ్రేక్ చేశాయి. నేడు బిట్‌కాయిన్ $1,06,648 (Rs 90L) జీవితకాల గరిష్ఠాన్ని అందుకుంది. $1,04,463 వద్ద మొదలైన BTC $1,04,324 వద్ద కనిష్ఠాన్ని తాకింది. $823 లాభంతో $1,05,287 వద్ద చలిస్తోంది. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ మళ్లీ $4000 స్థాయిని టచ్ చేసింది. లాభాల స్వీకరణతో USDT, XRP, SOL, BNB, DOGE, USDC, ADA, TRX, SHIB నష్టాల్లో ఉన్నాయి.

Similar News

News July 5, 2025

రేపు కుక్కలకు ఉచితంగా యాంటీరేబీస్ టీకాలు

image

AP: ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా రేపు కుక్కలకు ఉచితంగా యాంటీరేబిస్ టీకాలు వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ తెలిపింది. పశువైద్యశాలలు, ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు, పాలీ క్లినిక్స్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఇవి అందించనున్నారు. ఇందుకోసం 5.37 లక్షల టీకాలను సిద్ధం చేశారు. జంతువుల నుంచి మనుషులకు లేదా మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు.

News July 5, 2025

సర్పంచి ఎన్నికలు అప్పుడేనా?

image

TG: BC రిజర్వేషన్లు ఖరారయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. నిన్న ఆయనతో జరిగిన భేటీలో స్థానిక ఎన్నికలు, BCలకు 42% రిజర్వేషన్లపై చర్చించారు. కులగణనపై ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని వివరించారు. BCలకు 42% సీట్లు ఇచ్చి, బలహీన వర్గాలకు పార్టీ అండగా ఉంటుందనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపాలని సూచించినట్లు సమాచారం.

News July 5, 2025

రైతులకు శుభవార్త.. ఆగస్టు నాటికి కొత్త పాస్ పుస్తకాలు

image

AP: రీసర్వే పూర్తైన గ్రామాల్లో ఆగస్టు నాటికి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి పాస్‌బుక్‌పై QR కోడ్‌తో పాటు ఆధార్ ఆధారంగా తమ సొంత భూమి వివరాలు తెలుసుకునేలా చర్యలు సూచించారు. 2027 డిసెంబర్ నాటికి భూముల రీసర్వే పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికీ శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేయాలని సూచించారు.