News September 10, 2024
BIG RELIEF: కోలుకుంటున్న బెజవాడ

AP: వరదలతో అతలాకుతలమైన విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వారం రోజులుగా అటు వరదలు, ఇటు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు బయటకు వస్తున్నారు. నిన్న వర్షం కురవకపోవడంతో సహాయక చర్యలూ వేగంగా సాగాయి. వ్యాధులపై ఇంటింటి సర్వే నిర్వహించారు. మరోవైపు ధ్వంసమైన ప్రకాశం బ్యారేజీ గేట్ల స్థానంలో కొత్తవాటిని బిగించింది. ఇందుకోసం కన్నయ్య నాయుడిని రంగంలోకి దించింది.
Similar News
News December 9, 2025
రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. రెండో రోజు భారీగా పెట్టుబడులు

TG: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రెండో రోజు పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు రూ.1.11లక్షల కోట్ల పెట్టుబడులపై ప్రభుత్వంతో పలు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. పర్యాటక రంగంలో ₹7,045 కోట్లు, సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్ ₹10,000Cr, ఫెర్టిస్ ₹2000Cr, హెటిరో ₹1800Cr, JCK ఇన్ఫ్రా ₹9000Cr, AGP ₹6,750Cr, భారత్ బయోటెక్ ₹1000Cr పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా 40K+ ఉద్యోగాలు రానున్నాయి.
News December 9, 2025
మరో వివాదంలో కన్నడ హీరో దర్శన్!

బెంగళూరు పరప్పన జైలులో ఉన్న కన్నడ హీరో దర్శన్ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. దర్శన్ బ్యారక్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రేణుకాస్వామి హత్యకేసు నిందితుల్లో అనుకుమార్, జగ్గ, ప్రద్యూష్, లక్ష్మణ్లు తమను దర్శన్ వేధిస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. కొన్నిరోజుల క్రితం దర్శన్, జగ్గల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. తన ప్రాణాలు పోతాయని అనుకుమార్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
News December 9, 2025
అధికారం కోల్పోయాక విజయ్ దివస్లు.. BRSపై కవిత విమర్శలు

TG: బీఆర్ఎస్పై జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఇవాళ ఆ పార్టీ ‘విజయ్ దివస్’ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆమె సంచలన ట్వీట్ చేశారు. ‘అధికారం కోల్పోయాక దీక్షా దివస్లు.. విజయ్ దివస్లు. ఇది ఉద్యమాల గడ్డ.. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు!!’ అని రాసుకొచ్చారు. పార్టీ నుంచి బయటికొచ్చాక బీఆర్ఎస్పై కవిత తరచూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.


