News August 4, 2024

హెచ్1 బీ వీసాదారులకు భారీ ఊరట

image

హెచ్1 బీ వీసాదారులకు భారీ ఊరట లభించింది. వారి జీవిత భాగస్వాములు కూడా పని చేసేందుకు అవకాశమిచ్చే నిబంధనను సవాలు చేస్తూ ‘సేవ్ జాబ్స్ USA’ అనే సంస్థ వేసిన పిటిషన్‌ను కొలంబియా కోర్టు కొట్టివేసింది. భాగస్వాములకు ఉద్యోగాలివ్వరాదని, స్థానికులకే ఛాన్సులివ్వాలని కోరుతూ సంస్థ పిటిషన్‌లో కోరింది. దాన్ని తోసిపుచ్చిన కోర్టు, నిబంధనల విషయంలో DHSకి ఇమిగ్రేషన్ చట్టం విస్తృత అధికారాలను కల్పిస్తుందని పేర్కొంది.

Similar News

News November 17, 2025

కృష్ణా: ఖరీఫ్‌ పూర్తి.. అపరాల సాగు సిద్ధం

image

కృష్ణా జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు దాదాపు సగానికి పైగా పూర్తయ్యాయి. రైతులు వెంటనే అపరాల సాగుకు సిద్ధమవుతున్నారు. అనేక మండలాల్లో పొలాలను శుభ్రం చేసి సాగుకు అనువుగా మారుస్తున్నారు. కొన్ని చోట్ల విత్తనాలు సేకరించి, విత్తడం కూడా ప్రారంభించారు. అయితే, మరోవైపు దాళ్వా సాగు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమవుతోంది.

News November 17, 2025

ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం.. నేడు ఏం జరగనుంది?

image

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. స్పీకర్‌పై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌తో పాటు 10 మంది MLAలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌ను ధర్మాసనం నేడు విచారించనుంది. MLAలను విచారించేందుకు స్పీకర్‌కు మరింత సమయం ఇస్తారా? లేదా తుది నిర్ణయం తీసుకుంటారా? ఈ నెల 23న సీజేఐ గవాయ్ రిటైర్ కానున్న నేపథ్యంలో విచారణను మరో బెంచ్‌కు పంపిస్తారా? అన్న దానిపై ఆసక్తి నెలకొంది.

News November 17, 2025

శ్రీ వేంకటేశ్వర వర్సిటీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో 24 అకడమిక్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. M.Phil/PhD అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, దివ్యాంగులు రూ.500 చెల్లించాలి. వెబ్‌సైట్: https://svuniversityrec.samarth.edu.in